కొత్త ఏడాది వస్తోందంటే చాలు.. మనలో చాలామంది ఏవేవో తీర్మానాలు చేస్తుంటారు. జనవరి మొదలు అది కొనేద్దాం.. ఇది కొనేద్దాం అని ఎన్నో కలలు, దృఢ నిర్ణయాలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా మహిళలైతే అలంకార ప్రాయమైన బంగారం కొనడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారికి ఇది బాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కొత్త సంవత్సరంలో బంగారం రేట్లు భారీగా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది స్థిరంగానే ఉన్న బంగారం ధర కొత్త ఏడాదిలో మాత్రం పరుగులు తీయొచ్చని చెప్తున్నారు. ఈ మేరకు 2023 కమొడిటీస్ అవుట్‌లుక్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
ప్రస్తుతం mcx మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 55 వేల రూపాయలు ఉంది. అయితే.. 2023లో ఈ ధర మరో 7 వేల రూపాయలు ఎక్కువగా పెరగవచ్చని అంచనా. కాబట్టి కొత్త ఏడాదిలో బంగారం కొనాలని ఆశపడే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, డాలర్ తో పాలిస్తే రూపాయి విలువ బలహీన పడటం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం, కేంద్ర బ్యాంకుల నుంచి కొనుగోలు, బంగారంపై పెట్టుబడికి డిమాండ్ పెరగడం వంటివి పసిడి ధరలు గణనీయంగా పెరగడానికి కారణాలుగా చెప్తున్నారు. మరోవైపు.. ప్రపంచ కేంద్ర బ్యాంకులు కీలకమైన పాలసీ రేట్లను పెంచడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో అనిచ్చితి పరిస్థితులు ఏర్పడి బంగారం ధర పెరుగుదలకు దారి తీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతుంటాయి.
వీటికి తోడు కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. అదే జరిగితే.. ఆంక్షలు పెరుగుతాయి. దీంతో సరఫరాకు ఆటంకం కలిగి బంగారం, వెండి ధరలు పెరిగేందుకు ఆస్కారం ఉంది. అలాగే.. ప్రపంచదేశాల ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరో 6 నెలల పాటు ఇలాగే కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. పసిడి పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమే. 2022 లోనే బంగారం ధరలు 10% పెరిగాయి. వచ్చే ఏడాది(2023) మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర 62 వేలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి బంగారం కొనాలనుకునేవారు ఈ లోపే బంగారం కొంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. మీ అంచనా ప్రకారం.. బంగారం ధర పెరగుతుందా..? తగ్గుముఖం పడుతుందా..? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Commodity outlook: Gold price seen to touch ₹62,000, silver ₹80,000 in 2023, says ICICIdirect https://t.co/FXu1kIrpuF #breakingnews
— Get Hyped News Network (@gethypedllc) December 30, 2022