క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు షాపింగ్ కు, ఆన్ లైన్ పేమెంట్స్ కు పరిమితమైన క్రెడిట్ కార్డ్ వాడకాన్ని.. ఇకపై యూపీఐ ట్రాన్సక్షన్స్ కు ఉపయోగించుకునేలా అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు త్వరలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. బుధవారం జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు.
డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత దేశీయ రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి అనుసంధానించేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇప్పటి వరకు యూపీఐ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే అనుమతి ఉంది. తాజాగా క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇవ్వడంతో వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డు వాడకం కూడా మరింత ఎక్కువ అవ్వనుంది.
క్రెడిట్ కార్డ్ ను యూపీఐకి లింక్ చేయడం వల్ల ఉపయోగాలు
In order to further deepen the reach and usage of Unified Payments Interface (UPI), Reserve Bank of India on Wednesday proposed to allow linking of credit cards to the instant real-time payment system.
Track #RBIMPC #LIVE updates here https://t.co/im4xFpdha4 #RBI #RBIPolicy pic.twitter.com/Zi6i8GnAWY
— Economic Times (@EconomicTimes) June 8, 2022
క్రెడిట్ కార్డ్‌ని యూపీఐ యాప్‌లతో ఎలా లింక్ చేయాలంటే..
దేశంలో డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. మే నెలలో యూపీఐ ద్వారా చేసిన లావాదేవీల విలువ.. రూ. 10 లక్షల కోట్లు దాటాయి. గతేడాది మే నెలలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ.5 లక్షల కోట్లు ఉండగా.. ఈ సారి రెట్టింపు అవ్వడం గమనార్హం. తాజాగా క్రెడిట్ కార్డులను కూడా యూపీఐకి అనుసంధానించడంతో లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
RBI Allows Linking Credit Cards With UPI for Easy Transaction. RuPay customers will benefit first.#RBI #CreditCards pic.twitter.com/xGCHEZP3no
— Invest Tales (@InvestTales) June 8, 2022