ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోనే. ఇక కరోనా కారణంగా.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు అన్ని.. ఆన్‌లైన్ క్లాస్‌లు కొనసాగించాయి. అందువల్ల.. పిల్లల చేతిలో కూడా స్మార్ట్‌ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎక్కువ మంది వాడే మొబైల్స్‌లో ఒప్పో, వన్‌ప్లస్ ముందు వరుసలో ఉన్నాయి. అందుబాటు ధరలో ఉండటం.. అత్యధిక ఫీచర్లు అందిస్తుండటంతో చాలా మంది యూజర్లు ఈ బ్రాండ్ ఫోన్‌లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రెండు కూడా చైనా బేస్ కంపెనీలే. ఈ క్రమంలో తాజాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారీ షాక్ తగిలింది. తమ దేశంలో ఈ రెండు కంపెనీల స్మార్ట్‌ఫోన్లను బ్యాన్ చేస్తున్నట్లు ఓ దేశ కోర్టు తీర్పు వెలువరించింది. ఆ వివరాలు..
జర్మనీ కోర్టు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లకి జర్మనీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీల స్మార్ట్‌ఫోన్లను తమ దేశంలో బ్యాన్ చేస్తున్నట్లు జర్మనీ కోర్టు తీర్పు వెలువరించింది. దాంతో ఇకపై జర్మనీలో ఒప్పో, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండవు. ఇటీవల ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలు నోకియా పేటెంటెడ్ టెక్నాలజీకి సంబంధించి ఒక వివాదంలో చిక్కుకున్నాయి. ఈ పేటెంటెడ్ టెక్నాలజీ విషయంలోనే జర్మనీలోని మ్యాన్‌హీమ్ రీజినల్ కోర్టు ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్స్‌ని బ్యాన్ చేసింది. ఈ వివాదంలో కోర్టు నోకియాకు అనుకూలంగా తీర్పునిచ్చిందని నోకియా తన అధికారిక వెబ్ సైట్‌లో వెల్లడించింది.
వివాదం ఏంటంటే..
కొన్ని నెలల క్రితం నోకియా, ఒప్పో బ్రాండ్‌ల మధ్య 4G (LTE), 5G కనెక్టివిటీ పేటెంట్ విషయంలో తగాదాలు వచ్చాయి. ఇదే విషయమై రెండు కంపెనీల మధ్య సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగాయి. నోకియా పేటెంట్ పొందిన టెక్నాలజీని.. నోకియా లైసెన్సులు లేకుండానే ఒప్పో తన డివైజ్‌ల్లో ఉపయోగించింది. దీనికి సంబంధించి ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోకుండా ఒప్పో తన పేటెంటెడ్ టెక్నాలజీని అలా ఎలా ఉపయోగిస్తుందని నోకియా కంపెనీ ఆగ్రహించింది. ఆ తర్వాత 2021లో యూకే, ఫ్రాన్స్, జర్మనీతో సహా ఆసియాలోని ఇండియా, యూరప్‌లోని నాలుగు దేశాలలో ఒప్పోపై దావా వేసింది.
నోకియా ఒప్పోపై 9 స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు, ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్లపై మూడు రీజినల్ జర్మన్ కోర్టులలో దావా వేసింది. వాస్తవానికి నోకియా దాదాపు 129 బిలియన్ యూరోల భారీ పెట్టుబడితో 5G స్టాండడ్స్ ఎసెన్షియల్ పేటెంట్స్ విభాగంలో నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్‌లను నోకియా సొంతం చేసుకుంది. ఇవన్నీ గత కొన్ని ఏళ్లలోనే అనేక సెటిల్‌మెంట్లను సైతం పొందాయి.
ఈ క్రమంలో.. నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలపై దావా వేసింది. కోర్టు తీర్పు ఫలితంగా ఇకపై ఈ రెండు కంపెనీలు జర్మనీలో తమ డివైజ్‌లను విక్రయించలేవు. అయితే ప్రస్తుతం ఈ కంపెనీల మొబైల్స్‌పై కోర్టు విధించిన బ్యాన్ పర్మనెంట్ బ్యాన్ కాదు. రెండు కంపెనీలు ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: OnePlus: వన్‌ప్లస్ సంచలనం.. 20వేలలోపు ధరలో స్మార్ట్‌ఫోన్ రిలీజ్!
ఇది కూడా చదవండి: OnePlus Nord Buds: సూపర్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న వన్‌ప్లస్ ఇయర్ బడ్స్.. ధరెంతంటే?