ఉద్యోగం చేయాలని అందరూ భావిస్తుంటారు. కానీ, వ్యాపారంలోనే మీరు సెటిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే చాలా మందికి ఏ వ్యాపారం చేయాలి, ఎలా చేయాలి అనే ప్రశ్నలు ఉంటాయి. అలాంటి వారికోసం ఒక మంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం.
చాలా మంది ఉద్యోగం చేయడం, ఉద్యోగం కోసం వెతకడం, ఎప్పటికైనా ఉద్యోగం దొరక్కపోతుందా అని ఎదురుచూడటం చేస్తుంటారు. కానీ, వ్యాపారం చేయాలి అని మాత్రం ఆలోచించరు. చాలా తక్కువ మంది మాత్రమే వ్యాపారం వైపు అడుగులు వేస్తారు. కొందరికి ఆసక్తి ఉన్నా కూడా ఏ వ్యాపారం చేయాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎలా వ్యాపారం చేయాలి? అనే ప్రశ్నలకు సమాధానం దొరక్క అలాగే ఉండిపోతారు. వ్యాపారం మీద ఆసక్తి ఉండి.. ఐడియాస్ లేని వారికోసం.. ఇప్పుడొక తక్కువ బడ్జెట్ లో చేసుకునే బిజినెస్ ఐడియాని తీసుకొచ్చాం.
ఉద్యోగం చేయడం మంచిదే.. కానీ, వ్యాపారాలు చేస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది. చెప్పినంత తేలిక కాదులే చేయడం అంటారా? అయితే ఈ బిజినెస్ ఐడియా ఒకసారి చూస్తే మీకే అనిపిస్తుంది. వ్యాపారం చేయడం ఇంత తేలికా అని. ఇప్పుడు చెప్పుకోబోయేది టీ-షర్ట్ ప్రిటింగ్ బిజినెస్. కేవలం రూ.60 నుంచి రూ.70 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీరు ఒక షట్టర్ అద్దెకు తీసుకున్నా కూడా అదే ఖర్చు అవుతుంది. లేదా ఇంట్లో ప్రారంభించుకుంటాం అంటే ఇంక తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చు. ఇందులో మీకు ప్రధానంగా కావాల్సింది.. ఒక టీ షర్ట్ ప్రింటింగ్ మెషిన్.
తక్కువ ప్రొడక్టవిటీతో అయితే మీకు రూ.20 వేల నుంచే ప్రింటింగ్ మెషిన్స్ అందుబాటులో ఉన్నాయి. కాస్త త్వరగా పని కావాలి, ఎక్కువ టీషర్ట్స్ ప్రింటింగ్ చేయాలి అనుకుంటే మాత్రం కాస్త పెద్ద మెషిన్ తీసుకోవాలి. సాధారణంగా రూ.8,500 నుంచి రూ.లక్షన్నర వరకు మీరు ఈ మెషిన్ కొనుగోలు చేయచ్చు. మీ మార్కెట్ ని బట్టి మీకు ఏ మెషిన్ కావాలో నిర్ణయించుకోవచ్చు. మెషిన్ లో మ్యాన్యువల్, సెమీ మాన్యువల్ అంటూ కేటగిరీలు ఉంటాయి. కెపాసిటీని బట్టి గంటకు వందల్లో కూడా టీషర్ట్స్ ని ప్రింట్ చేయచ్చు. ముందుగా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. తర్వాత మీ మార్కెట్ కి తగినట్లుగా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
సాధారణంగా టీ- షర్ట్ ప్రింటింగ్ కి ఇలాగే వ్యాపారం చేయాలి అనేం రూల్స్, మార్గదర్శకాలు లేవు. ఇది మీ మార్కెటింగ్ స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు సోషల్ మీడియా, క్లాత్ స్టోర్స్, ఇండివిడ్యూవల్స్ తో పరిచయాలు పెంచుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్స్ లో మీ వ్యాపారాన్ని పుష్ చేసుకోవాలి. ముందుగా తక్కువ మార్జిన్, ఎక్కువ క్వాలిటీనీ మెయిన్ టైన్ చేస్తే గుడ్ విల్ ఏర్పడుతుంది. మీ స్కిల్స్ ని బట్టి బల్క్ ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ స్ట్రోర్స్ వారిని సంప్రదిస్తే మంచిది. ఇన్ స్టాగ్రామ్ మీమ్ పేజెస్ లో తక్కువ కాస్ట్ తో ప్రమోట్ చేయించుకోవడం చేయాలి. మీరంటూ ఒకరు మార్కెట్ లో ఉన్నారనే విషయం వినియోగదారులకు తెలిసేలా చేయాలి.
ఈ వ్యాపారం అనేది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ కిందకి వస్తుంది. మీరు ఒకసారి ఈ మెషిన్ ని కొనుగోలు చేస్తే ఇంక దాదాపుగా పెద్ద పెట్టుబడి ఏం ఉండదు. మెయిన్టినెన్స్ మాత్రం ఉంటుంది. ఇందులో టీ-షర్ట్ ప్రిటింగ్ కి రూ.10 నుంచి గరిష్టంగా రూ.30 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. క్వాలిటని బట్టి మీరు ప్రింటింగ్ కోసం రూ.50 నుంచి రూ.100 వరకు ఛార్జ్ చేయచ్చు. అదే టీషర్ట్స్ మీరే కొనుగోలు చేసి ప్రిటింగ్ చేయడం అయితే మీకు రూ.50 వరకు మార్జిన్ లభిస్తుంది. ఈ వ్యాపారంలో మీరు ఎంత లేదన్నా నెలకు రూ.40 వేలు తేలిగ్గా సంపాదించుకోవచ్చు. కానీ, మీ మార్కెటింగ్, కస్టమర్ మేనేజ్మెంట్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది.
ఈ వ్యాపారం చేసేందుకు బ్యాంకుల నుంచి లోన్ కోసం కూడా ట్రే చేయచ్చు. మీరు ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సబ్సిడీ స్కీమ్ లకు ఎల్జిబుల్ గా ఉన్నారేమో? ఈ వ్యాపారం వాటిలోకి వస్తుందేమో చెక్ చేసుకోవడం కూడా మంచిది. ఒకవేళ మీకు సబ్సిడీ లభించే అవకాశం ఉంటే మీ పెట్టుబడి మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఏ వ్యాపారం చేయాలన్నా.. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ముందు దానిపై అవగాహన ఉండాలి. మీరు ఉండే ప్రాంతం, మార్కెట్ ని బట్టి మీరు వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఈ బిజినెస్ సెట్ అవుతుందో? లేదో కూడా చూసుకోవాలి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.