‘పనికి తగిన ప్రతిఫలం’.. ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో అమల్లో ఉంది. పూర్వ కాలంలో చేసిన పనికి వస్తు, ధాన్య రూపంలో ప్రతిఫలం చెల్లించేవారు. ఇక రాజుల కాలంలో కొందరు పనికి ప్రతిఫలంగా భూములు ఇచ్చేవారు. ఇప్పుడు రాజులు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్య నడుస్తోంది. ప్రస్తుతం పనికి డబ్బుల రూపంలో వేతనం ఇస్తున్నారు. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. అయితే కరోనా తర్వాత నుంచి డబ్బు విలుప పడిపోతుండటంతో.. ఓ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు డబ్బు రూపంలో కాకుండా బంగారం రూపంలో శారీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ వివరాలు..
ఇంగ్లండ్‌కి చెందిన టాలీమనీ అనే సంస్థ ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తోంది. ఈ సంస్థ ఎంతో మందికి ఆర్థిక సూచనలు అందిస్తూ ఉంటుంది. ఇలా సలహాలు ఇవ్వడమే కాదు మేము కూడా స్వయంగా పాటిస్తామంటున్నాడు ఆ కంపెనీ సీఈవో కామెరాన్ ప్యారీ. ఇందుకు సంబంధించిన వివరాలను లండన్ కేంద్రంగా వెలువడే సిటీ ఏఎం పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉంది. ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకి పౌండ్ల విలువ పడిపోతుంది. జీతం తీసుకున్న రోజు నుంచి అది ఖర్చు చేసే రోజుకే పౌండ్ల విలువలో క్షీణత నమోదు అవుతోంది. ఇలా ద్రవ్యోల్బణం కారణంగా తమ కంపెనీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే లక్ష్యంతో సరికొత్త విధానంలో జీతం చెల్లింపులకు శ్రీకారం చుట్టారు మనీలాటీ సీఈవో కామెరాన్ ప్యారీ.
This CEO will now pay his employees in gold Cameron Parry, CEO of London-based financial services company TallyMoney, said gold is a time-tested inflation hedge #LatestNews by #MoneyControl https://t.co/CBYifYxmy8
— Market’s Cafe (@MarketsCafe) May 15, 2022
ఇది కూడా చదవండి: Rare Currency Notes: మీ దగ్గరున్న కరెన్సీ నోటుపై ఈ సీరియల్ నెం. ఉంటే రూ.3 లక్షలు సొంతం చేసుకోవచ్చు!
విలువ పడిపోదు
మనీటాలీలో ఉద్యోగులకు నెలవారీ జీతాన్ని నగదు రూపంలో కాకుండా బంగారం రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. నగదు విలువ రోజురోజుకి పడిపోతుంది. కానీ బంగారం విలువ పడిపోవడం లేదు. పైగా విలువ పెరగడంలో బంగారానికి సాటి రాగలవి లేవు. అందుకే జీతంగా విలువ కోల్పోతున్న నగదు పౌండ్లకు బదులు బంగారాన్ని ఇస్తున్నారు. ముందుగా టాప్ మేనేజ్‌మెంట్‌లో ఈ నిర్ణయం అమలు జరిపి సానుకూల ఫలితాలు వచ్చాక ఇప్పుడు కింది స్థాయి సిబ్బందికి కూడా వర్తింప చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఇరవై మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల మేలు కోసి ఆలోచించిన మనీలాటీ కంపెనీ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In 1891, the British governor on the coast sent Asantehene Prempeh an offer: give up Asante independ & become a colonial chief at a salary of £600/Yr ($100k in today’s cash). He refused. 5yrs later a new Governor made a new offer: pay 50k oz of gold (~$100 million) or be exiled. pic.twitter.com/AdIWxff06p
— Bright Simons (@BBSimons) January 21, 2022