భవిష్యత్ అవసరాల కోసం.. రూపాయి.. రూపాయి.. పోగేయడం అందరూ చేసే పనే. కాకుంటే.. వాటిని ఎలా పొదుపు చేస్తే మంచి రాబడి ఉంటుందన్నది చాలామందికి తెలియదు. సంపాదించిన ఆదాయాన్నంతా బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ.. ఎక్కువ మొత్తంలో రాబడి పొందలేకపోతున్నారు. ఒకవేళ తెలిసినా.. సురక్షితమైనవో.. కాదో.. అన్న భయంతో వెనుకడుగుస్తుంటారు. ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ అందిస్తున్న పొదుపు పథకాలను ఎంచుకుంటే.. మీ డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు. అత్యంత సురక్షితమైనవి మరియు అనేక ప్రయోజనాలు కలవి. తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూనే.. భారీ మొత్తంలో రాబడి పొందవచ్చు.
‘జీవన్ లాబ్‘.. ఎల్ఐసీ అందిస్తున్న అనేక పాలిసీల్లో ఇది కూడా ఒకటి. ఇది పరిమిత ప్రీమియం చెల్లింపుతో నాన్-లింక్డ్ ప్రాఫిట్ ప్లాన్. ఈ పాలసీ కింద మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత పాలసీదారుకు ఏకమొత్తం మొత్తం ఇవ్వబడుతుంది. ఈ పాలసీ వల్ల రాబడి మాత్రమే కాదు.. కుటుంబానికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. అంటే రక్షణ, రాబడి రెండూ ఉంటాయి. ఇంకా ఆదాయపు పన్ను మినహాయింపు కూడా సొంతం చేసుకోవచ్చు. ఇలా ఒక్క ప్లాన్‌తో మూడు లాభాలు పొందొచ్చు. అంతేకాదు.. మూడేళ్ల తర్వాత ఈ ప్లాన్‌పై లోన్ సదుపాయం కూడా పొందొచ్చు.
8 నుంచి 59 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే ఇందులో మూడు(10,13, 16 సంవత్సరాలు) ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. ఎంత మొత్తానికి అయినా పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే కనీసం రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో పాలసీదారుకు పూర్తి హామీతో పాటు రివర్షనరీ బోనస్, చివరి అదనపు బోనస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఒకవేళ పాలసీ కాలవ్యవధిలో భీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి అష్యూర్మొత్తంతో పాటు రివర్షనరీ బోనస్, ఫైనల్ అడిషన్ బోనస్ ఇస్తారు.
ఉదాహరణకు భీమా తీసుకునే వ్యక్తి వయసు 25 ఏళ్లు అనుకుందాం. మెచ్యూరిటీ కాలవ్యవధి 25 సంవత్సరాల అనుకుంటే.. రూ.54 లక్షల వరకు రాబడి అందుతుంది. అందుకోసం ప్రతిరోజూ రూ.260 చొప్పున పెట్టుబడి పెట్టాలి. అంటే.. ఏటా రూ.92,400 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది 25 ఏళ్లలో రూ.20 లక్షలకు చేరుకుంటుంది. దీని తర్వాత మీరు రివర్షనరీ బోనస్, చివరి అదనపు బోనస్‌తో పాటు మొత్తం 50 నుండి 54 లక్షల రూపాయలను రాబడిగా పొందుతారు.
Get Life Cover and attractive returns with LIC’s Jeevan Labh.
Know more at https://t.co/ijAn8omTB7 pic.twitter.com/GPGrlzKXhk— LIC India Forever (@LICIndiaForever) February 8, 2017