ప్రపంచ వ్యాప్తంగా వివాహ వ్యవస్థలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లిల్లు చేసుకోవడం కొన్నేళ్లు గడిపిన తరువాత విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రెటిస్, ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు ఈ వరుసలో ముందుంటారు.ఈ క్రమంలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన వివాహబంధానికి స్వస్థి పలికిన తరువాత ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు.

అమెజాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్. దీనిని 1994 జూలై 5న జెఫ్ బెజోస్ స్థాపించారు. ఇది వాషింగ్టన్‌లోని సీటెల్‌లో ఉంది. అయితే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ తన ప్రియిరాలు లారెన్ శాంచెజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రేమలో మునిగి తేలుతున్న వీరిరువురు ఎంగెజ్మెంట్ జరుపుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన 53ఏళ్ల లారెన్ శాంచెజ్, 59ఏళ్ల జెఫ్ బెజోస్ 2018నుంచే డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ బెజోస్ అప్పటికి తన భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. అయితే 2019లె బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్ తో ఉన్న 25ఏళ్ల బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. బెజోస్ నుంచి మెకంజీ 38 బిలియన్ డాలర్లు భరణంగా పొందారు. ఇదిలా ఉండగా బెజోస్ ప్రియురాలైన లారెన్ శాంచెజ్ కు గతంలో పాట్రిక్ వైట్ సెల్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. వారి వివాహబంధాలకు గుడ్ బై చెప్పిన తరువాత ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ ప్రేమ పక్షులు ఇప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్ కు చేరుకున్నారు. కాగా, అమెజాన్ సీఈఒ బాధ్యతల నుంచి 2021లో తప్పుకున్న జెఫ్ బెజోస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.