దేశంలో ఐపీఎల్ సందడి మొదలయ్యింది. మ్యాచులు ఎప్పుడు మొదలవుతాయా అని క్రికెట్ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. లీగ్ మొదలవ్వడానికి ఇక గంటల సమయం మాత్రమే మిగిలివుంది.మార్చి 26 నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఐపీఎల్ మ్యాచులను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా క్రికెట్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ తో పాటు ఓటీటీ సేవల్ని ఉచితంగా అందిస్తోంది. కొద్దిరోజుల క్రితమే రిలయన్స్ జియో సైతం ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌ను ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది.
ఎయిర్‌టెల్ అందిస్తున్న ఉచిత డిస్నీ+హాట్‌స్టార్ సేవలు
రూ. 499 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా లభిస్తుంది. డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.
రూ. 599 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 3 జీబీ డేటా లభిస్తుంది. డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.
రూ. 839 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2 జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెన్ఫిట్స్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినొచ్చు.
రూ. 2,999 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా లభిస్తుంది. డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.
రూ. 3359 ప్లాన్: ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 2 జీబీ డేటా, దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ బెన్ఫిట్ పొందవచ్చు.
జియో అందిస్తున్న ఉచిత డిస్నీ+హాట్‌స్టార్ సేవలు
రూ. 499 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 601 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 3 జీబీ డేటా(+6 జీబీ డేటా అదనంగా), అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 659 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 799 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 1066 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా(+5 జీబీ డేటా అదనంగా), అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ. 3119 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. యూజర్లకు ప్రతిరోజు 2 జీబీ డేటా(+10 జీబీ డేటా అదనంగా), అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అదనంగా ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Are you ready for India’s biggest cricket league?
Recharge with Jio Cricket Plans and watch all matches live with 1 year Disney+ Hotstar subscription.Recharge Now: https://t.co/2YyMMpCUOf #JioCricketPlans #Jio #T20 #Cricket pic.twitter.com/2kt8yaXiAP
— Reliance Jio (@reliancejio) March 19, 2022