దేశంలో ఇటీవల భారీగా స్కాంలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మొన్నలిక్కర్ బారన్ విజయ్ మాల్యా నుండి నిన్న వజ్రాల వ్యాపారి మోహుల్ ఛోక్సీ వరకు భారత బ్యాంకుల నుండి డబ్బుల తీసుకుని ఎగ్గొట్టిన వారే. ఈ స్కాంలన్నీ వారు విదేశాలు పరారయ్యాక వెలుగు చూశాయి. తాజాగా భారత్ లో మరో స్కాం వెలుగు చూసింది. అయితే ఈ స్కాంలో కంపెనీ ఉద్యోగులే.. సంస్థకు ఎసరు పెడుతున్నారు. అదే ఫుడ్ డెలీవరీ సంస్థ జొమాటో. అయితే సీఈఓ దీపిందర్ గోయల్ కు తెలిసే జరుగుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కస్టమర్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.
జొమాటోలో తనకు ఎదురైన స్కాంను ఇటీవల ఓ వ్యక్తి బయటపెట్టాడు. ఉత్తరాఖండ్ కు చెందిన వినయ్ సతి కొద్ది రోజుల క్రితం జొమాటోలో బర్గర్స్ ఆర్డర్ పెట్టారు. ఆన్ లైన్ పేమంట్ చేశారు. ఆర్డర్ తెచ్చిన వ్యక్తి సార్ నెక్స్ట్ నుండి మీరు ఆన్ లైన్ లో పేమంట్ చేయకండని, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టండని వినయ్ ను అడిగారు. ఎందుకని అని డెలివరీ బాయ్ ను అడగ్గా.. రూ. 700-800 విలువైన ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోంది. కానీ మీ ఆర్డర్ ను తీసుకోలేదని చెబుతాము, కానీ మేము మీకు ఇస్తామని, దానికి రూ. 200-300 వరకు చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. ఈ భారీ మోసం గురించి వినయ్ తన సోషల్ మీడియా ఖాతా లింక్డిన్ లో పోస్టు చేశారు.
ఈ పోస్టులో జోమాటోను డెలివరీ బాయ్స్ మోసం చేస్తున్నారని, అతను ఇచ్చిన ఆఫర్ తో ఎంజాయ్ చేయాలో లేక ఈ మోసాన్ని బహిర్గతం చేయాలా అని తనను తాను ప్రశ్నించుకుని, తానొక ఎంటర్ ప్రెన్యూర్ కాబట్టి రెండవ ఆప్షన్ ఎంచుకున్నట్లు తెలిపారు. దీనిపై జొమాటో సీఈఓ స్పందించారు. ఈ మోసం తమకు తెలుసునని, ఈ లూప్ హోల్స్ ను సరిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కాగా, ఎప్పటి నుండో జరుగుతున్నా.. ఈ మోసాన్ని చూస్తు చూడకుండా ఉంటే కంపెనీ నష్టాల బాట పట్టడం ఖచ్చితమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జొమాటాలో జరుగుతున్న ఈ మోసంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.