బంగారం ధర రోజురోజుకీ పతనమవుతోంది. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి తరుణం అంటూ ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరి.. సులభంగా బంగారంపై పెట్టుబడి ఎలా పెట్టచ్చు అనే విషయంపై చాలా మందికి అవగాహన లేకపోవచ్చు.
బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా స్త్రీలు ఓ అకేషన్ ఉన్నా కూడా బంగారం కొనేందుకు ఇష్టపడతారు. అయితే బంగారం అంత తక్కువకు దొరకదు కాబట్టి చాలామంది దీనిని కొనేందుకు సుముఖంగా ఉండరు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా చూస్తుంటారు. కొందరు అలంకరణ ఆభరణంగా బంగారాన్ని కొంటుంటే కొందరు మాత్రం పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. అయితే పేదలు, మధ్యతరగతి వాళ్లు మాత్రం ఈ బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆలోచించరు. ఎందుకంటే అది చాలా ఖరీదు అని ఆగిపోతారు. అయితే ఇప్పుడు కేవరం రూ.100 కూడా బంగారంపై పెట్టుబడి పెట్టచ్చని మీకు తెలుసా?
బంగారం అంటే దాదాపుగా అందరికీ ఇష్టమే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొన్ని పరిస్థితులు, జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో ఏడుసార్లు బంగారం ధర తగ్గింది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,550 ఉండగా.. ఫిబ్రవరి 17కి 24 క్యారెట్ బంగారం ధర రూ.56,730గా ఉంది. అంటే దాదాపు ఒక వారంలోనే 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.820 తగ్గింది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా ఫిబ్రవరి 17న రూ.52,000గా కొనసాగుతోంది. గడిచిన కొద్దిరోజులుగా ఇలా బంగారం ధర తగ్గుతూనే ఉంది.
ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం.. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన సమయంగా చెబుతున్నారు. ఎందుకంటే బంగారం ధర ఎంత తగ్గినా కూడా భవిష్యత్ లో కచ్చితంగా పుంజుకుంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా వచ్చే రోజుల్లో బంగారం ధర రూ.60 వేల వరకు చేరుకుంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే బంగారంపై పేద, మధ్యతరగతి ప్రజలు ఎప్పుడూ కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకురారు. అయితే ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
మీరు ఈ యాప్స్ లో గోల్డ్ కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. రూ.100 నుంచి కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. 24 క్యారెట్ బంగారాన్ని మీకు నచ్చిన మొత్తంలో కొనుగోలు చేసుకోవచ్చు. దానిని ఫిజికల్ గా మీరు పొందాలనేం లేదు. డిజిటల్ గోల్డ్ గా మీ ఖాతాలో భద్రంగా ఉంటుంది. ఒక్క ఫోన్ పే, గూగుల్ పే వంటి సంస్థలే కాకుండా.. కొందరు బంగారు వ్యాపారులు, పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ డిజిటల్ గోల్డ్ ని కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆ రోజు ఉన్న గోల్డ్ రేటుని, దానిపై 3 శాతం జీఎస్టీతో మీరు కొనుగోలు చేసేందుకు వీలుంటుిద. ఇలాంటి తరుణంలో బంగారం కొనుగోలు చేసి భవిష్యత్ లో లాభాలు పొందవచ్చు అని ఆర్థిక నిపుణులు సలహాలిస్తున్నారు. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది మాత్రం మీరు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం మాత్రమే.