దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి అయిన రోజులివి. లేదంటే చాలా ప్రయోజనాలు కోల్పోతాడు. బ్యాంకు ఖాతా తెరవలేరు, ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేరు.. ఇలా ఒకటి రెండోమిటి.. ఆధార్‌కార్డు లేకుండా ఏ చిన్న పని కూడా జరగదు. అయితే చాలామంది ఆధార్ కార్డులో సవరణలు చేస్తూ ఉంటారు. అడ్రస్, ఫోన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్.. ఇలా పలు మార్పులు చేస్తుంటారు. అయితే.. ఈ మార్పులు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు చేస్తామంటే కుదరదు. అందుకు సంబంధించి యూఐడీఏఐ (ఆధార్ జారీచేసే సంస్థ) కొన్ని నిబంధనలు జారీచేసింది. వాటి ప్రకారమే ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సివుంటుంది.
పేరు: ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉన్నట్లయితే.. సవరించడానికి రెండు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది.
పుట్టిన తేదీ: ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ చేంజ్ చేయడానికి అవకాశం లేదు. అయితే, తప్పుగా పడిన సందర్భాల్లో సరైన పుట్టిన తేదీ వివరాలున్న డాక్యుమెంట్ ని జతచేసి మార్చుకునే వీలుంది.
జెండర్: లింగ వివరాలను ఒకసారి మార్చుకోవచ్చు.
అడ్రస్: ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయడానికి ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది.
చూశారుగా… ఆధార్ కార్డులో మీకు నచ్చినన్ని సార్లు మార్పులు చేస్తామంటే కుదరదు. ఒకవేళ ఆ అవకాశం ఉన్నా.. అందుకు గల రుజువు యొక్క కారణాలను జత చేస్తూ యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అందుకు ఆధార్ ఎన్రోల్‌మెంట్ సెంటర్ నుంచి యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి మీ అభ్యర్థనను అందజేయాలి. అనంతరం ప్రాంతీయ కార్యాలయం వారు విచారణ చేసి మీ అనుమతిని అంగీకరిస్తారు. అలాగే, ఆధార్‌లోని వివరాలను అప్‌డేట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో కూడా తెలుసుకోండి..