ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నా కూడా రోల్స్ రాయిస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిజానికి ఆ కారుకి పెట్టే ధరతో విడిగా అంతకన్నా ఎక్కువ ఫీచర్స్ తో మీరు స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేయచ్చు. కానీ, చాలా మంది నెలలు తరబడి వెయిట్ చేసి రోల్స్ రాయిస్ కారునే ఎందుకు కొంటారో చూద్దాం.
రోల్స్ రాయిస్.. ఈ పేరు వినగానే చాలా మందికి గూస్ బమ్స్ వచ్చేస్తాయి. ఈ కారుని రోడ్డు మీద చూస్తే నీళ్లలో ఉండాల్సిన పడవ రోడ్డు మీదకు వచ్చింది అనుకుంటారు. ఈ కారుని లైవ్ లో చూస్తే చాలు అనుకునే వాళ్లు కొంతమంది అయితే ఒక్కసారి అయినా ఎక్కాలి అని కొంతమంది కోరుకుంటారు. ఇంక ఈ కారుని కొనాలి అంటే అది అందరి వల్లా అయ్యే పని కాదు. ఈ కారు 3, 4 కోట్ల నుంచి గరిష్టంగా ఇంత ఉంటుంది అని చెప్పలేం. ఎందుకంటే మీ కారు ఎలా కావాలి అని మీరు కోరుకుంటారో ఆ కారు ధర అంతకు వెళ్తుంది. ఈ కారుకి సంబంధించి అన్ని పార్ట్స్, ఇంటీరియర్ అంతా చేతులతోనే చేస్తారు. మీరు ఇప్పుడు ఆర్డర్ చేస్తే కారు తయారీకి 6 నెలల సమయం పడుతుంది. అసలు రోల్స్ రాయిస్ కారు అంత ధర ఎందుకు ఉంటుందో చూద్దాం.
కారు లోపల 40 వేల రంగుల వరకు ఆప్షన్ ఉంటుంది. ఈ కారుని పెయిట్ చేయాలంటే 50 కిలోల రంగు కావాలి. మీరు ఒక కలర్ ఆప్షన్ ఎంచుకున్నారు అంటే ఆ కలర్ మరొకరు వాడకూడదని మీరు రోల్స్ రాయిస్ ని కోరచ్చు. అంటే అప్పుడు మీ కారు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. పెయింట్ లో మీరు గోల్డ్, డైమెండ్స్ ఇలా మీకు నచ్చిన దానిని కలపమని కోరచ్చు. మీరు ఎంచుకున్న వుడ్, లెథర్.. ప్రపంచంలోనే టాప్ క్వాలిటీని వాడతారు. రోల్స్ రాయిస్ కారుపై మీకు కనిపించే సన్నని లైన్ ని ఉడత జుట్టుతో తయారు చేసిన బ్రష్ తో చేతితో గీస్తారు.
ప్రస్తుతం ఆ వర్క్ చేసేందుకు ఒకే వ్యక్తి ఉన్నారు. డాష్ బోర్డులో కూడా మీరు గోల్డ్, డైమెండ్స్ ఇలా ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలంటే ఆ డిజైన్ ఎబ్రయిడరీ కూడా చేస్తారు. ఏంజెల్ బొమ్మ స్థానంలో కూడా మీకు నచ్చిన ఆకారాన్ని కోరవచ్చు. కారు సీలింగ్ లో స్టార్స్ ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ కారులో వచ్చే గొడుగుని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కొన్ని లెక్కల ప్రకారం చూస్తే రోల్స్ రాయిస్ గొడుగు ధర రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ధర ఉంటుందని చెబుతున్నారు.
ఇంక ఈ రోల్స్ రాయిస్ లో డీటెయిలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముందు కనిపించే గ్రిల్ ని కూడా చేత్తోనే చేస్తారు. సెన్సార్, డిజైన్ ఇలా ప్రతి చిన్న డిటెయిలింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. రోల్స్ రాయిస్ లో వాడే ప్రతి వస్తువు ఎంతో ఖరీదైందిగా ఉంటుంది. కారు బయట కావాల్సిన చోట టాప్ క్వాలిటీ స్టెయిన్ లెస్ స్టీల్ ని వాడతారు. ఏ చిన్న డీటెయిల్ ని కూడా మిస్ చేయరు. మీరు కారుని మీకు నచ్చినట్లుగా డిజైన్ చేస్తారు. మీరు ఎంత ఖర్చు పెడితే మీ రోల్స్ రాయిస్ అంత యూనిక్ గా ఉంటుంది.
రోల్స్ రాయిస్ కంపెనీ కాంటినెంటర్ కంపెనీ టైర్లను వాడుతుంది. ఈ టైర్లలో ఇన్సులేషన్ ఉంటుంది. దీని వల్ల అన్ని కార్లతో పోలిస్తే రోల్స్ రాయిస్ కారు వెళ్తున్నప్పుడు శబ్ధం చాలా తక్కువ వస్తుంది. రోల్స్ రాయిస్ లో 12 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారులో మీరు ఏ డోర్ ని కూడా మాన్యువల్ గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బటన్ తో ఆపరేట్ చేయచ్చు. డాష్ బోర్డులో ఆపరేటింగ్ కూడా మరీ ఆటోమేటిక్ గా కాకుండా కాస్త ఓల్డ్ టచ్ ఉంటుంది. ఈ కారు హైట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఈ కారులో సీట్లు హీట్ కావడమే కాదు.. ఒక బటన్ నొక్కగానే మసాజ్ కూడా చేస్తాయి. ఈ కారులో ప్రతి ఒక్కటి కూడా మీకు లగ్జరీ ఫీల్ ని ఇస్తుంది. అన్ని కంపెనీలు మాదిరి రోల్స్ రాయిస్ హడావుడిగా కారు తయారీ చేయదు. ప్రతి వస్తువుని చేత్తే చేస్తారు. మీరు ఏ కస్టమైజేషన్ కోరితే దాన్ని చేస్తారు. మీరు కోరుకున్న డిజైన్స్, కస్టమైజేషన్, డీటెయిల్స్ ని బట్టే రోల్స్ రాయిస్ కారు ధర ఉంటుంది. మరి రోల్స్ రాయిస్ కారులో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.