హోటల్ రూమ్స్ అగ్రిగేటర్ ఓయో తమ వినియోగదారులకు తీపికబురు అందించింది. దేశంలో కరోనా సంక్షోభం తర్వాత ట్రావెల్ రంగాన్ని బలపేతం చేయాలనే లక్ష్యంతో ఓయో ఒక కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కస్టమర్లు ఒక రోజు ఉచితంగా ఉండొచ్చని తెలియజేసింది. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక పెట్టింది. ఐదు రోజుల పాటు ఓయ రూమ్స్‌లో బస చేస్తే.. ఒక రోజు ఉచితంగానే ఉండొచ్చని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం కొందరికే వర్తించనుంది. గోల్డ్ సభ్యలుకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఇతర కస్టమర్లు ఈ ఆఫర్ పొందాలని భావిస్తే.. మరికొన్ని రోజులు ఎక్కువగా బస చేయాల్సి ఉంటుంది.
లాయల్టీ ప్రోగ్రామ్ విజర్డ్ కింద రిజిస్టర్ అయిన గోల్డ్ సభ్యులకు ఈ ఆఫర్ ఉంటుంది. 92 లక్షలకు పైగా సభ్యులతో ఓయో విజర్డ్ అనేది అతిపెద్ద లాయల్టీ ప్రోగ్రామ్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది. ట్రావెల్, ఫుడ్ బ్రాండ్స్ ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాయి. రెగ్యులర్ ట్రావెల్ కస్టమర్లకు రివార్డు అందించాలనే లక్ష్యంతో ఓయో విజర్డ్ ప్రోగ్రామ్ నడుస్తోంది. ప్రస్తుతం ఓయో విజార్డ్‌లో మూడు రకాలు ఉన్నాయి. విజర్డ్ బ్లూ, విజర్డ్ సిల్వర్, విజర్డ్ గోల్డ్. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అనేవి ఓయో లాయల్టీ ప్రోగ్రామ్‌కు టాప్ సబ్‌స్క్రైబర్ మార్కెట్స్‌గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Rare Currency Notes: మీ దగ్గరున్న కరెన్సీ నోటుపై ఈ సీరియల్ నెం. ఉంటే రూ.3 లక్షలు సొంతం చేసుకోవచ్చు!
గోల్డ్ కస్టమర్లు ప్రతి ఐదు రోజుల బస అనంతరం ఒక రోజు ఉచితంగా ఉండొచ్చు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది. అదే సిల్వర్, బ్లూ కస్టమర్లు అయితే వరుసగా 7 రోజులు, 8 రోజులు ఉండాల్సి ఉంటుంది. అప్పుడు వీరికి కూడా ఒక రోజు ఉచిత రూమ్ సర్వీస్ అఫర్ లభిస్తుంది. ఫ్రీ రూమ్ నైట్స్, తగ్గింపు ఆఫర్లు వంటి మా ప్రోత్సాహకాల వల్ల కస్టమర్లు ఓయోలో పదే పదే ఉండేందుకు ఇది దోహదపడుతుందని కంపెనీ పేర్కొంది. 2021 మార్చి 31వరకు పరిశీలిస్తే.. ఏడాదిలో 70 శాతానికి పైగా రిపీట్ కస్టమర్లు ఉన్నట్లు తెలిపింది. తాజా కొత్త లాయల్టీ సర్వీసుల వల్ల వీరికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు’ ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు.
The free room night offer will be available to the Gold members of its loyalty program called Wizard.https://t.co/c9E48KOXYk
— Mint (@livemint) May 20, 2022