మనిషి ఉండగా కుటుంబాన్ని ఏ లోటూ లేకుండా చూసుకోవడం ఒక ఎత్తు అయితే, లేనప్పుడు కూడా ఆ కుటుంబం ఏ లోటూ లేకుండా జీవించేలా చేయడం మరొక ఎత్తు. దీని కోసం లక్షలు సంపాదించాల్సిన పని లేదు. కేవలం నెలకు రూ. 1000 దాస్తే చాలు. ఆ మనిషి లేనప్పుడు కూడా సంతోషంగా బతుకుతుంది.
అందరికీ కోట్లాది ఆస్తులు ఉండవు. 90 శాతం మంది ఉద్యోగాలు, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక వ్యక్తి జీతం మీదే అతని కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. లేదా అతను తెచ్చే కొద్ది పాటి సంపాదన మీద కుటుంబం మొత్తం ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఎవరూ ఊహించలేరు. బాగానే ఉంటాము కదా, మనకేం జరగదు అని అనుకోవడానికి లేదు. తక్కువ వయసులో కూడా అనారోగ్యం కారణంగానో, ప్రమాదాల కారణంగానో చనిపోవడం అనేది జరుగుతుంది. ఒక మనిషి మరణించడం అంటే ఇంట్లో ఒక పెద్ద దిక్కు కోల్పోయినట్టు. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.
తనకొచ్చే కొద్ది సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ, పిల్లల్ని చదివించుకుంటూ వెళ్తున్న సామాన్యుడు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా చనిపోతే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించారా? మీరు ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీరు లేనప్పుడు కూడా సంతోషంగా జీవించగలిగేలా ఏర్పాట్లు చేయాలి. మీరు లేని లోటును ఎవరూ తీర్చలేకపోవచ్చు, కానీ డబ్బు లేని లోటును మీరు మాత్రమే తీర్చగలరు. దాని కోసమే టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక నిర్ణీత కాలం వరకూ వచ్చే బీమా. అంటే మీరు 25 ఏళ్ల వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని నెలకు కొంత డబ్బు ప్రీమియంగా 60 ఏళ్ల వయసు వచ్చేవరకూ చెల్లిస్తూ ఉంటే కనుక.. మధ్యలో మీకేమైనా జరగరానిది జరిగితే మీరు లేని సమయంలో మీ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల వరకూ బీమా కవరేజ్ అనేది అందుతుంది. వారు రోడ్డున పడకుండా ఉండడం కోసం మీరు ఇప్పుడు కట్టే ప్రతి రూపాయి ఉపయోగపడుతుంది.
పలు బ్యాంకులు, బీమా సంస్థలు తక్కువ ప్రీమియం తీసుకుంటూ పెద్ద మొత్తంలో బీమా ఇస్తున్నాయి. ఉదాహరణకు మీ వయసు 30 ఏళ్ళు అయి ఉండి, ఏడాదికి మీ సంపాదన 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో ఉంటే కనుక మీరు రూ. 490 పెట్టి కెనరా, హెచ్ఎస్బీసీ బ్యాంకులో బీమా తీసుకుంటే రూ. 30 లక్షల లైఫ్ కవర్ అనేది వస్తుంది. 30వ ఏట నుంచి పాలసీ అనేది మొదలవుతుంది. మీకు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి పాలసీ పూర్తవుతుంది. ఈ మధ్యలో కనుక పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే కనుక ఆ వ్యక్తి కుటుంబానికి 30 లక్షల లైఫ్ కవర్ అనేది అందుతుంది. పైగా ఎటువంటి పన్నులూ ఉండవు. ఆయా బీమా సంస్థలు, బ్యాంకుల బట్టి ప్రీమియం అనేది మారుతుంది. ఒకవేళ మీ సంపాదన ఏడాదికి 3 లక్షల పైన ఉంటే కనుక రూ. కోటి బీమాకు మీరు అర్హులవుతారు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియాంజ్, కోటక్ లైఫ్, ఎస్బీఐ వంటి ఇన్సూరెన్స్ లు ఉన్నాయి.
ఉదాహరణకు టాటా ఏఐఏ తీసుకుంటే.. 22 జూన్ 1990లో పుట్టిన వారు ఐతే కనుక నెలకు రూ. 1944 ప్రీమియం ఉంటుంది. ఇది తీసుకుంటే ఏడాదికొకసారి ఉచిత హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. ప్రమాదంలో మరణిస్తే రూ. 25 లక్షలు బీమా ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన వాహనంలో ప్రయాణిస్తూ మరణిస్తే కనుక రూ. 50 లక్షలు ఇస్తారు. ప్రమాదంలో వైకల్యానికి గురైతే రూ. 25 లక్షలు, ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన వాహనంలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై వైకల్యానికి గురైతే రూ. 50 లక్షలు ఇస్తారు. పాలసీ కట్టే వ్యక్తి ఏదైనా కారణం చేత హాస్పిటల్ లో అడ్మిట్ అయితే రూ. 10 లక్షలు కవరేజ్ ఇస్తారు. 40 రకాల క్లిష్టమైన అనారోగ్యాలకు రూ. 10 లక్షల కవరేజ్, వైద్యం లేని రోగం వస్తే కనుక 50 శాతం లైఫ్ కవర్ అనేది వెంటనే చెల్లిస్తారు. మిగతా 50 శాతం మరణించిన తరువాత నామినీకి ఇస్తారు. ఇలా కోటి రూపాయల వరకూ ప్రయోజనాలు ఉంటాయి. ఏమీ జరగకుండా సాధారణ మరణం సంభవిస్తే కనుక రూ. కోటి కుటుంబ సభ్యులకు వెళ్తాయి.
అన్ని బీమాలు ఒకేలా ఉండవు. కానీ మీకు సూటయ్యే బీమా ఎంచుకోవడం మంచిది. మీరు లేకపోయినా మీ కుటుంబ సభ్యులు సంతోషంగా జీవితాన్ని లీడ్ చేయాలి అంటే మీరు ఏ పాలసీని ఎంచుకుంటే మంచిదో అనేది చూసుకోవాలి. మీ స్థోమతకు తగ్గట్టు మంచి ఇన్సూరెన్స్ ని ఎంచుకుంటే మంచిది. మీ జీతం ఏడాదికి 3 లక్షల పైన ఉంటే కనుక ఆయా పాలసీ సంస్థలు, బ్యాంకుల బట్టి మీ ప్రీమియం నెలకు రూ. 1000 నుంచి రూ. 1300 మధ్య ఉంటుంది. ఈ ప్రీమియం కడితే మరణాంతరం మీ కుటుంబానికి రూ. కోటి రూపాయల బీమా అనేది అందుతుంది. అదే 2 కోట్ల బీమా రావాలంటే కనుక నెలకు రూ. 2,196 నుంచి రూ. 2,600 మధ్యలో ఉంటుంది ప్రీమియం.