ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన వినియోగదారుల కోసం మరోసారి ఆఫర్లను తీసుకొచ్చింది. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో జనవరి 17 నుంచి 22 వరకు అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అందులో భాగంగా ఐఫోన్ ధర కూడా భారీగా తగ్గింది. కేవలం రూ.30 వేలలోపే మీరు ఐఫోన్ కొనేయచ్చు. యాండ్రాయిడ్ నుంచి iosలోకి మారాలని ఎదురుచూస్తున్న వారికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఐఫోన్ కొనాలంటే దాదాపు రూ.40 వేలుపైనే ఖర్చు చేయాలి.
కానీ, ఆ భారీ డిస్కౌంట్ తో రూ.30 వేలు కన్నా తక్కువ ధరకే యాపిల్ iPhone SEని సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ SE 64 జీబీ వేరియంట్ ధర 39,900 కాగా 24 శాతం డిస్కౌంట్ తో 30,249కు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు అన్నీ కలిపి ఐఫోన్ SEని 30వేల లోపే కొనుగోలు చేయచ్చు. అదే 256 జీబీ హైఎండ్ వర్షన్ ధర రూ.54,900 కాగా.. 17 శాతం డిస్కౌంట్ తో రూ.45,249కే అందిస్తోంది. దీనికి అదనంగా డెబిట్/క్రెడిట్ కార్డు ఆఫర్లతో రూ.3 వేలు అదనంగా తగ్గింపు ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందచ్చు. ఫ్లిప్ కార్ట్ లో రూ.11,750 వరకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.
iPhone SE ఫీచర్ల విషానికి వస్తే.. 4.7 ఇంచెస్ రెటీనా HD డిస్ ప్లే, 12mp రేర్ కెమెరా, 7mp ఫ్రంట్ కెమెరా ఉంటుంది. A13 బయోనిక్ చిప్, థర్డ్ జనరేషన్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. Ip67 వాటర్, డస్ట్ ప్రొటెక్షన్ తో iPhone Se వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ సౌలభ్యాలు ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.