పండగ వేళల్లో ఉద్యోగులకు స్పెషల్ గిఫ్ట్ లు ఇస్తుంటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే హోలీ గిఫ్ట్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. హోలీ పండుగ సందర్భంగా ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ను తీసుకొచ్చింది.
సాధారణంగా పండుగల సందర్భంలో పలు కంపెనీలు ఉద్యోగులకు బంపర్ ఆఫర్ లు ప్రకటిస్తుంటాయి. ఇక ప్రభుత్వాలు సైతం ఈ పండగ వేళల్లో ఉద్యోగులకు స్పెషల్ గిఫ్ట్ లు ఇస్తుంటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే హోలీ గిఫ్ట్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ను తీసుకొచ్చింది. దాంతో ఉద్యోగులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ స్కీమ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హోలీ పండుగ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు మోదీ. హోలీ సందర్భంగా స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు రూ.10వేల రూపాయలను అందించనుంది. అంటే హోలీ పండుగకు ఉద్యోగులు ఈ 10వేలను ముందుగానే పొందొచ్చు. ఈ మెుత్తంపై ఎలాంటి వడ్డీ కూడా ఉండదు. మార్చి 31 వరకు ఈ స్కీమ్ ను ఉద్యోగులు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్ పై ఈ డబ్బులు ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఇలా ముందుగానే పొందే అడ్వాన్స్ మెుత్తంపై ఎలాంటి వడ్డీ ఉండదు.
ఈ నేపథ్యంలోనే ఈ స్కీమ్ ను ఉపయోగించుకున్న తర్వాత నెలకు రూ.1000 చొప్పున చెల్లిస్తే చాలు. అయితే ఉద్యోగులు ఈ స్కీమ్ కింద 10 వేలు పొందాలని అనుకుంటే.. ఆ 10వేలను డిజిటల్ రూపంలోనే వినియోగించాల్సి ఉంటుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇక గత సంవత్సరం కూడా ఇదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు స్పెషల్ అడ్వన్స్ స్కీమ్ ను తీసుకొచ్చింది సెట్రల్ గవర్నమెంట్.