నిత్యావసరాలు మొదలు బంగారం వరకు.. నేడు సమాజంలోని ప్రతిదాని ధర పెరుగుతోంది. దీనికి తోడు మే నెల ప్రారంభం అవుతుండంటంతో.. అయిల్ కంపెనాలు దాని ధర తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంటున్నాయి. ఆ వివరాలు...
నేడు సమాజంలో తాగే నీటి దగ్గర నుంచి.. బంగారం వరకు ప్రతి దాని ధర పెరుగుతూనే ఉంది. సమాజంలో ఎంలాటి పరిస్థితి ఉంది అంటే.. ఆదాయంలో పెరుగుదల అంతంత మాత్రంగా ఉంటే.. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. మరి ప్రతి దాని ధర పెరుగుతూ పోతుంటే.. ఖర్చులు పెరగక ఏం జరుగుతుంది. ఇక ప్రతి నెల ప్రారంభంలో అయిల్ కంపెనీలు గ్యాస్ ధరలను పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటాయి. ఇక మే 1న గ్యాస్ కంపెనీలు.. సామాన్యులకు శుభవార్త చెప్పాయి.. సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ రేటు తగ్గింది. కొత్త రేట్లను గ్యాస్ కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేశాయి.
అయితే గ్యాస్ కంపెనీలు తగ్గించింది వాణిజ్య సిలిండర్ ధర. ఏకంగా 171.50 రూపాలు తగ్గింది. ఇక ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,856.50కు చేరింది. ఇక ప్రభుత్వ రంగ చమురు కంపెనీల.. గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం స్థిరంగా ఉంచాయి. వంట కోసం ఉపయోగించే 14.2 కేజీల గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య, గృహావసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధరలు ప్రతి నెలా 1వ తేదీన మారుతాయి. ఇక ఆ నెల మొత్తం అదే రేటు ఉంటుంది. ఏప్రిల్ నెలలో వాణిజ్య సిలిండర్ల ధర తగ్గిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1న దీని ధర రూ. 92 తగ్గింది. ఇక మే నెలలో కూడా వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు.
ఇక, మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. 14.2 కిలోల సిలిండర్‌ను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు రూ. 1161 చెల్లించాలి. ఇక హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1155 వద్ద కొనసాగుతోంది. డెలివరీ ఛార్జీలు కూడా ఈ ధరలోనే కలిసి ఉంటాయి. కాబట్టి, గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తులకు అదనంగా ఒక్క రూపాయి కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ, వాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తే, మీ గ్యాస్ ఏజెన్సీకి, కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు.