ఏదైనా అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు.. మన ఐడెంటీ గురించి ప్రశ్న తప్పక వస్తుంది. అప్పుడు.. ఆధార్, రేషన్, పాన్ కార్డు లాంటివి సమర్పించమంటారు. ఇక రేషన్‌కార్డు లేకపోతే.. చాలా ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారు. ఇక కరోనా సమయంలో ప్రభుత్వాలు రేషన్‌కార్డు ఉన్నవారికి నగదుతో పాటు.. ఉచితంగా బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాలను కూడా సరఫరా చేసింది. ఇక ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు అర్హులు కావాలన్న రేషన్ కార్డు తప్పనిసరి. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే.. కేంద్రం సుమారు 10 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసి.. సామాన్యలకు భారీ షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారంతో.. రేషన్ కార్డులు పొందిన వారికి కేంద్రం ఇలా కోలుకోలేని విధంగా షాకివ్వనుంది. సుమారు 10 లక్షల మంది ఇలా తప్పుడు సమాచారంతో రేషన్ కార్డు పొందారని… త్వరలోనే వాటిని రద్దు చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ప్రసుత్తం దీనిపై సమీక్ష కొనసాగుతుందని.. రాబోయే రోజుల్లో.. రద్దు చేసే రేషన్‌కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని సమాచారం. ఇప్పటివరకైతే ప్రభుత్వం సుమారు 10 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించింది. ఈ జాబితాను స్థానిక రేషన్ డీలర్లకు పంపునన్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా నకిలీ లబ్ధిదారుల పేర్ల జాబితాను తయారు చేసి.. ఆ జాబితాను జిల్లా కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత ఈ సమాచారాన్ని పరిశీలించి.. తప్పుడు సమాచారం ఇచ్చిన లబ్ధిదారుల రేషన్‌కార్డులను రద్దు చేయాలని సంబంధిత శాఖను ఆదేశించనుంది.
ఎన్‌ఎప్‌ఎస్‌ఏ ప్రకారం.. తప్పుడు సమాచారంతో రేషన్‌కార్డు పొందిన వారిని అనర్హులుగా ప్రకటించిడమే కాక.. వాటిని రద్దు చేయనుంది. ఇలా రద్దు కాబడే రేషన్‌కార్డు లబ్ధిదారుల జాబితాలో ఆదాయపు పన్ను చెల్లించే వారు.. వారి పేరు మీద 6 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక కొందరు ఉచిత రేషన్‌ను విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దాంతో ఈ విషయంపై సీరియస్ అయిన ప్రభుత్వం.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రేషన్‌కార్డులు దుర్వినియోగం అవుతున్న జాబితాలో.. ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉందని తెలింది. ఇక కరోనా తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పసుపు, గులాబీ రంగు రేషన్‌కార్డు ఉన్నవారికి ప్రతి నెలా ఐదు కిలోల బియ్య ఉచితంగా అందిస్తోన్న సంగతి తెలిసిందే.