అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విధంగా చేస్తే 10 లక్షలు సేవ్ అవుతాయి. అంతేనా ఇండివిడ్యువల్ హౌజ్ ని సొంతం చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి.
సొంత ఇల్లు అనేది ఎంతో మంది కల. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వలస వెళ్తుంటారు. ఉద్యోగం నిమిత్తం అక్కడే స్థిరపడతారు. అద్దె ఇంట్లో ఉండడం కంటే సొంత ఇంట్లో ఉంటే బాగుంటుందని అనుకుంటారు. వచ్చిన జీతంలో డబ్బు దాచుకుని.. చిట్టీలు వేసుకుని ఆ సొమ్ము, బ్యాంకు లోన్ కలిపి సొంతింటి కల నిజం చేసుకోవాలనుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతున్న కారణంగా ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. తక్కువలో తక్కువ 3 సెంట్లు స్థలంలో అంటే 144 గజాల్లో ఇల్లు కట్టుకోవాలంటే.. హైదరాబాద్ లాంటి నగరంలో స్థలానికి ప్రత్యేకంగా రూ. 60 లక్షల దాకా అవుతుంది.
ఒక చదరపు అడుగు వచ్చి హైదరాబాద్ లో రూ. 4500 ఉంది. 3 సెంట్లు అంటే 1306 చదరపు అడుగులు. 1306 చదరపు అడుగులకు దగ్గర దగ్గర రూ. 60 లక్షలు అవుతుంది. హైదరాబాద్ లోని మంచి ఏరియాలో స్థలం కావాలంటే రూ. 60 లక్షలు అవుతుంది. కొంచెం సిటీకి దూరంగా అయితే 30, 40 లక్షలు ఉంటుంది. సిటీకి మరీ దూరంగా ఉండడానికి ఎవరూ ఇష్టపడరు. స్థలానికి రూ. 60 లక్షలు అనుకుంటే.. నిర్మాణానికి 30, 40 లక్షలు అవుతుంది. ఈ లెక్కన హైదరాబాద్ లో సొంత ఇల్లు కావాలంటే కోటి రూపాయల నుంచి కోటి 20 లక్షల వరకూ ఖర్చవుతుంది. అమ్మో ఇంత డబ్బు పెట్టడం మా వల్ల కాదని చాలా మంది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫ్లాట్ అయితే 40 లక్షలకు వచ్చేస్తుంది కాబట్టి ఇదే ఉత్తమం అని అనుకుంటున్నారు.
కానీ సొంత ఇల్లు అన్న ఫీలింగ్ ఫ్లాట్ ఇవ్వదు కదా. ఎందుకంటే స్థలం ఏ ఒక్కరికో చెందదు. అపార్ట్మెంట్ లో ఉంటున్న అందరికీ చెందుతుంది. పైగా ఫ్లాట్స్ రీసేల్ వేల్యూ తక్కువ. అందులోనూ ఒక అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలను ఇరికించి పెట్టినట్టు ఉంటుంది. బయట కొంచెం కూడా ఖాళీ స్థలం ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి ఉండదు. ఇండివిడ్యువల్ గా ఉన్న ఇంటికి, 20 ఫ్లాట్ లు ఉన్న అపార్ట్మెంట్ కి చాలా తేడా ఉంటుంది. కానీ తప్పక ఫ్లాట్స్ కొంటున్నారు. మధ్యతరగతి వాళ్ళు సొంత ఇంట్లో ఉండాలన్న కోరిక ఉన్నా కూడా ఆర్థిక స్థోమత లేక ఫ్లాట్స్ వైపు వెళ్లాల్సి వస్తుంది. అయితే మీకు తెలుసా.. ఫ్లాట్ ధరకే మీరు సొంత ఇంట్లో ఉండచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లో 2 బీహెచ్కే ఫ్లాట్ కి 60 లక్షలు అవుతుంది. అదే 1 బీహెచ్కే ఫ్లాట్ అయితే 30 లక్షలు ఉంటుంది. ఈ ధరలు మియాపూర్, దిల్ షుక్ నగర్ ఏరియాల్లో ఉన్న ఫ్లాట్స్ వి.
ఇదే డబ్బుని సొంత ఇంటి కోసం పెట్టుబడి పెడితే మీకు ఎంత ప్రయోజనం చేకూరుతుందో తెలుసా? అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? మీ బంధువులు లేదా మీకు బాగా కావాల్సిన వ్యక్తులు లేదా మీ స్నేహితులు ఒక నలుగురు కలిసి స్థలం కొనుక్కుంటే ఒకరి మీద పడే భారం అందరి మీద పడడం వల్ల కష్టం అనిపించదు. ఇందాక చెప్పినట్టు స్థలానికి రూ. 60 లక్షలు అనుకుంటే నలుగురు వ్యక్తుల మీద ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. ఇక నిర్మాణానికి ఎవరి ఫ్లోర్ లు వాళ్ళవే కాబట్టి 4 ఫ్లోర్లకి రూ. 20 లక్షల చొప్పున రూ. 80 లక్షలు అవుతుంది. అంటే ఇల్లు కట్టుకోవాలంటే ఒక్కొక్కరికి రూ. 35 లక్షలు ఖర్చు అవుతుంది. అందులోనూ డబుల్ బెడ్ రూమ్ హౌజ్ కట్టుకోవచ్చు. ఈ ధరకు హైదరాబాద్ లో 1 బిహెచ్కే మాత్రమే వస్తుంది. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కావాలంటే 60 లక్షలు అవుతుంది. ఎలా చూసినా గానీ మీకు 25 లక్షలు మిగులుతాయి. కనీసం 10 లక్షలైనా మిగలకుండా ఉండవు.
మీరు, ఇంకో ముగ్గురు స్నేహితులు లేదా బంధువులతో కలిసి కట్టుకుంటే 40 లక్షల్లో సొంత ఇల్లు పూర్తయిపోతుంది. ఇదే ధరకు ఫ్లాట్ కొంటే మీకంటూ స్థలం ఉండదు. అదే స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి కొనుక్కుంటే నలుగురికి కలిపి స్థలం ఉంటుంది. నలుగురూ స్నేహితులో, బంధువులో కాబట్టి పెద్ద సమస్య ఉండదు. పైగా అపార్ట్మెంట్ తో పోలిస్తే ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది. ఇండివిడ్యువల్ హౌజ్ కాబట్టి హ్యాపీగా ఉండచ్చు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. నలుగురు స్నేహితులు కలిసి స్థలం కొనుక్కుని, ఎవరి ఫ్లోర్ వారు తమకు నచ్చినట్టు నిర్మించుకుంటున్నారు. కాకపోతే పక్కాగా అగ్రిమెంట్ చేయించుకోవాలి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పగడ్బందీగా డాక్యుమెంట్స్ రాయించుకోవాలి. రిజిస్ట్రేషన్ కూడా చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి.
మీతో పాటు లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తులను ఎంచుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవారు కాకుండా ఎప్పటికీ మీ దగ్గరే ఉండే వ్యక్తులతో కలిసి స్థలం కొనుక్కుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా మిగలాలి అనుకుంటే మీరు సర్దుకుపోగలరు అనుకుంటే ఒక సెంట్ స్థలాన్ని ముగ్గురు స్నేహితులతో కలిసి రూ. 20 లక్షలకు కొనచ్చు. అప్పుడు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు పడుతుంది. అయితే సెంట్ స్థలం దొరకాలంటే కష్టం కాబట్టి 3 సెంట్ల స్థలాన్ని 12 మంది కలిపి కొనుక్కుంటే అప్పుడు 60 లక్షలు అవుతుంది. ఒక్కొక్కరికీ 5 లక్షలు అవుతుంది. నిర్మాణానికి 15 లక్షల నుంచి 20 లక్షలు అవుతుందనుకుంటే మీకు 20 లక్షల నుంచి 25 లక్షల్లో సొంత ఇల్లు అయిపోతుంది. ఈ విధంగా చేస్తే మీకు 10 నుంచి 15 లక్షలు మిగులుతాయి. ఎలా అయినా గానీ ఈ ట్రెండ్ ని ఫాలో అయితే తక్కువ ఖర్చుతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.