ప్రముఖ టెలీకాం సంస్థలు వరుసగా రీఛార్జ్ ప్లాన్ ల ధరలు పెంచుతున్నాయి. తాజాగా జీయో, వీఐ వంటి కంపెనీలు సైతం రీఛార్జ్ టారిఫ్ ధరలు పెంచి వినియోగదారులకు షాకిచ్చాయి. అయితే తాజాగా ప్రభుత్వ టెలీకాం సంస్థ అయిన BSNL మాత్రం వాటి దారిలో వెళ్లకుండా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్ తో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అసలు BSNL తీసుకొచ్చిన అదిరిపోయే ఆఫర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రూ.599 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 5GB, అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా వస్తాయని తెలిపింది. ఈ ఆఫర్ 84 రోజుల వరకు ఉంటుందని ఇక ఇదే కాకుండా అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వినియోగదారులు ఉచిత డేటాను ఉపయోగించుకునే వెసులుబాటును కూడా ప్రకటించింది. తాజాగా BSNL ప్రకటించిన ఈ అదిరిపోయే ఆఫర్ తో కస్టమర్లు ఎగిరి గంతేస్తున్నారు.