సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అందమైన కుటీరాన్ని నిర్మించుకోవాలి అనుకుంటారు. ప్రస్తుతం మనుషులు ఎక్కువయ్యి పోయి.. భూమి తక్కువగా ఉండటంతో.. ఉన్న కొద్ది పాటి స్థలంలోనే అపార్ట్ మెంట్స్ కడుతున్నారు. ఈ ఆకాశ హర్యాల్లోనే ప్లాట్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అందమైన కుటీరాన్ని నిర్మించుకోవాలి అనుకుంటారు. ప్రస్తుతం మనుషులు ఎక్కువయ్యి పోయి.. భూమి తక్కువగా ఉండటంతో.. ఉన్న కొద్ది పాటి స్థలంలోనే అపార్ట్ మెంట్స్ కడుతున్నారు. ఈ ఆకాశ హర్యాల్లోనే ప్లాట్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అయితే ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎంతకు కొనుగోలు చేయాలని తెలియక కొన్ని సార్లు ..మోసపోతుంటారు. ఇల్లు కొనాలంటే కాసులతో పని. అలాగే ఇందులో కూడా ప్లాట్స్ లక్షల నుండి కోట్లలో ధరలు పలుకుతున్నాయి. సామాన్యుడు ప్లాట్స్ తీసుకునేందుకు బయటపడుతున్నాడు. అయితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తుండటంతో సొంత ఇంటి కల దాదాపుగా తీరుతుంది. ఇప్పుడు ఇదే ప్లానులో ఉన్నట్లయితే ఈ వార్త మీ కోసమే
బ్యాంకు నుండి రుణం తీసుకోని ఇళ్లు కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నట్లయితే.. తొందర పడొద్దు. ఎందుకంటే మీరు ఊహించని విధంగా చౌక ధరకే ఇల్లు కొనుగోలు చేయొచ్చు. ఎక్కడ, ఎప్పుడు అనుకుంటున్నారా.. ఒక్క నిమిషం. ఇలాంటి వారికోసమే అదిరిపోయే ఆఫర్ తెచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఇంతకు అదేమిటంటే..? పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆన్ లైన్ వేలాన్ని నిర్వహిస్తుంది. ఈ ఆక్షన్‌లో మార్కెట్ రేటు కన్నా చౌక ధరకే ఇల్లు కొనుగోలు చేయోచ్చు. తక్కువ ధరకే ల్యాండ్స్, ప్రాపర్టీస్, లగ్జరీ హౌస్ కొనేయొచ్చు. ఈ నెల 20న దేశ వ్యాప్తంగా పీఎన్బీ దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ వేలం నిర్వహించబోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాపర్టీలు, ఇళ్లు, దుకాణాలను బ్యాంక్ విక్రయిస్తుంది.
బ్యాంకులు తమ కస్టమర్లకు రుణాలను అందిస్తాయి. ఈ రుణాలు సకాలంలో చెల్లించకపోతే.. ఆ ప్రాపర్టీని బ్యాంకులు రికవరీ చేసుకుంటాయి. వాటినే వేలం వేస్తాయన్న సంగతి విదితమే.మొత్తం 34 గవర్న్‌మెంట్, 98 అగ్రికల్చర్ ల్యాండ్స్, 1133 ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్, 2155 కమర్షియల్ ప్రాపర్టీస్, 11374 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు వేలం వేయనుంది. ఢిల్లీ, బెంగళూరు,ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో తక్కువ ధరలకే ఇళ్లు కొనుగోలు చేయోచ్చు. అయితే ఎప్పుడు, ఎక్కడ,ఏయే ప్రాంతాల్లో వేలం వేస్తున్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ లేదా బ్రాంచ్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉంటాయి. మీకు ఏ ప్రాపర్టీ నచ్చితే .. దాని కోసం బిడ్ చేసుకోవాలి. దాని కోసం ముందు కొంత నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వేలంలో పాల్గొనేందుకు లాగిన్, పాస్ వర్డ్ వంటి వివరాలు వస్తాయి. ఇకెందుకు ఆలస్యం మీకు నచ్చిన ప్రాపర్టీని కొనుగోలు చేయండిక.