బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూతపడనున్నాయి. మీకేమైనా బ్యాంకులో అత్యవసర పనులు ఉంటే, సెలవు దినాలను ముందుగా తెలుసుకొని, అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
ఫిబ్రవరి నెల పూర్తి కావడానికి ఇంకో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నాలుగు రోజుల్లో రెండు రోజులు బ్యాంకులు మూసే ఉంటాయి. ఫిబ్రవరి 25న నాలుగో శనివారం కాగా, ఫిబ్రవరి 26 ఆదివారం కావున ఈ రెండు రోజులు బ్యాంకులు క్లోజ్. మరోవైపు.. పండుగలు, వారాంత సెలవులతో కలిపి మార్చి నెలలో బ్యాంకులు ఏకంగా 12 రోజులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ సర్వీసలు, ఏటీఎం సర్వీసలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కావున సెలవు దినాలను ముందుగా తెలుసుకొని, అందుకు తగ్గటుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
మార్చి నెలలో బ్యాంకుల పనిదినాలను, వాటి సెలవుల జాబితాను ఆర్బీఐ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. పండుగలు, వారాంత సెలవులతో కలుపుకొని మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూతపడనున్నాయి. 5,12,19, 26 తేదీలలో ఆదివారాలు, మార్చి 11న రెండో శనివారం, 25న నాలుగో శనివారం.. కారణంగా 6 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇవి కాకుండా హోలీ, ఉగాది, శ్రీరామ నవమి వంటి రాష్ట్రాల వారీగా పండుగలు ఉన్నందున మరో 8 రోజులు మూసే ఉంటాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలో 9 రోజులు మూతపడతాయి.
గమనిక: ఈ సెలవు దినాలు రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా మారుతుంటాయి. నేషనల్ బ్యాంక్ హాలీడేస్ మాత్రం దేశవ్యాప్తంగా అమలవుతాయి. సెలువు రోజుల్లో కూడా ఏటీఎంలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యాథావిథిగా కొనసాగుతాయి.