చిన్న పొదుపు పథకాలు చాలా పాపులర్. రిస్క్ లేకుండా మంచి వడ్డీ అందించే పథకాల పట్ల జనం ఎప్పుడూ ఆకర్షితులవుతారు. అలాంటి వాటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్టాఫీస్ వంటి పథకాలు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెట్టిన వారి సొమ్ముపై వడ్డీ రేట్లు పెరుగుతాయని అనుకున్న్నారు. కానీ వారికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను 0.3 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లను మాత్రం పెంచలేదు.
పీపీఎఫ్ వడ్డీ రేట్లను ఇంతకు ముందు ఉన్నట్టే 7.1 శాతంగా ఉంచింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 6.8 శాతం వద్ద ఉంచింది. ఇక సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క వడ్డీ రేటు కూడా ఏం మారలేదు. 7.6 శాతంగానే వడ్డీ రేటు ఉంచింది. రెండేళ్ల లోపు డిపాజిట్ చేసిన పోస్టాఫీస్ పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. రెండు నుంచి మూడేళ్ల వ్యవధిలో డిపాజిట్ చేసిన పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను పెంచింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్, కిసాన్ వికాస్ పత్ర, నెలవారీ ఆదాయ ఖాతా పథకంపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే నాలుగు సార్లు వడ్డీ రేట్లను పెంచింది.
వడ్డీ రేట్లు పెంచిన ప్రతి సారీ ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ఫిక్సిడ్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వ పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టేలా జనాల్ని ఆకర్షించేందుకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. ఈ క్వార్టర్ లో చేపట్టిన సమీక్షలో చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చింది. అయితే ఇప్పుడు కేవలం కొన్ని పథకాలకు మాత్రమే వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
(1/3) #JustIn – Government of India raises rates on some small #savings schemes by up to 30 basis points for the third (October – December) quarter⬆️
Fixed deposits of two, three years, Senior Citizen Savings Scheme, etc, to get more interest rates for the third quarter💸
— Koshex (YC S21) (@KOSHEXHQ) September 29, 2022