ఇప్పటికే ఇంధనం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడిపై త్వరలో రీఛార్జ్ భారం పడనుంది. ఈ రోజుల్లో ‘ఫోన్’ వాడని కుటుంబం అంటూ లేదు. చిన్నదో.. పెద్దదో.. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ రీఛార్జ్ ల పెరుగుదల అనేది.. సంపన్నుల కంటే సామాన్యులపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. సెకనుకు పైసాతో మొదలుపెట్టి.. తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్లాన్స్ అంటూ యూజర్లను బాగా ఆకర్షించిన టెలికాం కంపెనీలు.. ఇప్పుడు డబ్బే లక్ష్యంగా పెట్టుకొని వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
దేశీయ ప్రైవేట్ రంగ టెలికాం సంస్థలు మరోసారి వినియోగదారులపై చార్జీల భారం మోపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో మళ్లీ టారీఫ్‌లను పెంచవచ్చని సమాచారం. ఈ పెంపుతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవిన్యూలో 20-25 శాతం వృద్ధిని చూడాలనుకుంటున్నాయని భారతీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిసెర్చ్ మంగళవారం విడుదల చేసిన నివేదికనుబట్టి తెలుస్తోంది. ఈ నిర్ణయంతో టెలికాం కంపెనీల లాభాలూ 1.80 – 2.20 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. కాగా, నెట్‌వర్క్, స్పెక్ట్రమ్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) టెలికం సంస్థలకు కీలకమన్నది నిపుణుల అభిప్రాయం. ఏఆర్‌పీయూ అంతంతమాత్రంగా ఉంటే సేవలపై ప్రభావం చూపుతుందనేది టెలికాం కంపెనీల వాదన.
#Telecom companies may push their average revenue per user (ARPU) higher by 25 per cent over the next 6-12 months to achieve a sustainable return on capital employed (RoCE) of 10 per cent, said a Crisil report. pic.twitter.com/OXsywu0eur
— IANS (@ians_india) November 4, 2020
ఇప్పటికే టారీఫ్‌ల మోత మోగిస్తున్న టెలికాం కంపెనీలు
భారీ నష్టాలు.. దేశీయ టెలికాం రంగంలో కన్సాలిడేషన్‌కు దారి తీయగా.. మొబైల్ టారీఫ్‌ల పెంపునకూ కారణమైంది. అంతకుముందు ఇంటర్నెట్, కాల్ చార్జీలు అత్యంత చౌకగా ఉండగా, ఇప్పుడు అవి పెద్ద ఎత్తునే పెరిగాయి. గతంతో పోల్చితే రెట్టింపయ్యాయన్నా అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో చాలామంది వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లలో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉన్నప్పటికీ.. సింగిల్ సిమ్‌నే వాడటం మొదలుపెట్టారు. ఒకదానికి మాత్రమే రీఛార్జ్ చేస్తూ.. మరో సిమ్ ను నామమాత్రంగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి చార్జీలు పెరిగితే మొబైల్ కస్టమర్లకు అది మరింత భారంగా మారుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Telecom operators Bharti Airtel, Reliance Jio and Vodafone Idea are set to increase their prepaid tariffs by Diwali 2022.#Jio #Airtel #VI #MobileTarrif #MobileData #Karttoday pic.twitter.com/vwh0VsIQBx
— Karttoday – Tech & Offers (@karttoday) May 31, 2022
20 శాతం ఏఆర్‌పీయూ పెంపు లక్ష్యం
గత ఆర్థిక సంవత్సరం (2021-22) టెలికాం సంస్థల.. ఏఆర్‌పీయూ వృద్ధి 5 శాతంగానే ఉన్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం దీన్ని 15-20 శాతానికి పెంచుకోవాలని సంస్థలు భావిస్తున్నాయి. అందుకే మళ్లీ చార్జీల పెంపు యోచనలో ఉన్నట్టు సమాచారం. అక్టోబర్ నుంచి ఈ వడ్డింపులు ఉండవచ్చని అంచనా. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం మూడు ప్రైవేట్ టెలికం సంస్థల యాక్టివ్ యూజర్లు 3 శాతం పెరిగారని, దీంతో 2.9 కోట్ల మంది వినియోగదారుల నుంచి మళ్లీ ఆదాయం రావడం మొదలైందని క్రిసిల్ తెలిపింది. దేశీయ టెలికం రంగంలో ఇప్పుడు ప్రైవేట్ రంగం నుంచి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలుండగా, ప్రభుత్వ రంగం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్/ఎంటీఎన్‌ఎల్ మాత్రమే ఉన్నది.
ఇది కూడా చదవండి: మిడిల్ క్లాస్ వాళ్లకు శుభవార్త! 10 వేల EMIతో 30 లక్షలు విలువచేసే ఇల్లు కొనొచ్చు!
ఎయిర్‌టెల్ కంపెనీ ఈ ఏడాది ఏఆర్‌పీయూను రూ.200కు చేర్చాలని లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. గతేడాది డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఏఆర్‌పీయూ రూ.163గా ఉందని తెలుస్తోంది. అలాగే వొడాఫోన్ ఐడియా కూడా ఏఆర్‌పీయూను పెంచుకోవాలని భావిస్తోంది. కాగా టారిఫ్ దరల పెంపు వల్ల జియో, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు వరుసగా ప్రతి నెలా కస్టమర్లను కోల్పోతూ వస్తున్నాయి. అయితే మరి కొంత మంది మాత్రం టారిఫ్ ధరల పెంపు వెంటనే ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. స్పెక్ట్రమ్ వేలం తర్వాత ధరల పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరి.. మరోసారి రీఛార్జ్ ధరలు పెరిగితే.. ఆ భారం సామాన్యుడిపై ఎంతమేర ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.