SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Bad News For Telecom Users Mobile Charges Will Raise Soon

Mobile Tariff Charges: వినియోగదారులకు షాక్! మరోసారి పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 1 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mobile Tariff Charges: వినియోగదారులకు షాక్! మరోసారి పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!

ఇప్పటికే ఇంధనం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడిపై త్వరలో రీఛార్జ్ భారం పడనుంది. ఈ రోజుల్లో ‘ఫోన్’ వాడని కుటుంబం అంటూ లేదు. చిన్నదో.. పెద్దదో.. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ రీఛార్జ్ ల పెరుగుదల అనేది.. సంపన్నుల కంటే సామాన్యులపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. సెకనుకు పైసాతో మొదలుపెట్టి.. తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్లాన్స్ అంటూ యూజర్లను బాగా ఆకర్షించిన టెలికాం కంపెనీలు.. ఇప్పుడు డబ్బే లక్ష్యంగా పెట్టుకొని వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

దేశీయ ప్రైవేట్‌ రంగ టెలికాం సంస్థలు మరోసారి వినియోగదారులపై చార్జీల భారం మోపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ద్వితీయార్ధం (అక్టోబర్‌-మార్చి)లో మళ్లీ టారీఫ్‌లను పెంచవచ్చని సమాచారం. ఈ పెంపుతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవిన్యూలో 20-25 శాతం వృద్ధిని చూడాలనుకుంటున్నాయని భారతీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రిసెర్చ్‌ మంగళవారం విడుదల చేసిన నివేదికనుబట్టి తెలుస్తోంది. ఈ నిర్ణయంతో టెలికాం కంపెనీల లాభాలూ 1.80 – 2.20 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. కాగా, నెట్‌వర్క్‌, స్పెక్ట్రమ్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) టెలికం సంస్థలకు కీలకమన్నది నిపుణుల అభిప్రాయం. ఏఆర్‌పీయూ అంతంతమాత్రంగా ఉంటే సేవలపై ప్రభావం చూపుతుందనేది టెలికాం కంపెనీల వాదన.

#Telecom companies may push their average revenue per user (ARPU) higher by 25 per cent over the next 6-12 months to achieve a sustainable return on capital employed (RoCE) of 10 per cent, said a Crisil report. pic.twitter.com/OXsywu0eur

— IANS (@ians_india) November 4, 2020

ఇప్పటికే టారీఫ్‌ల మోత మోగిస్తున్న టెలికాం కంపెనీలు

భారీ నష్టాలు.. దేశీయ టెలికాం రంగంలో కన్సాలిడేషన్‌కు దారి తీయగా.. మొబైల్‌ టారీఫ్‌ల పెంపునకూ కారణమైంది. అంతకుముందు ఇంటర్నెట్‌, కాల్‌ చార్జీలు అత్యంత చౌకగా ఉండగా, ఇప్పుడు అవి పెద్ద ఎత్తునే పెరిగాయి. గతంతో పోల్చితే రెట్టింపయ్యాయన్నా అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో చాలామంది వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్లలో డ్యూయల్‌ సిమ్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ.. సింగిల్‌ సిమ్‌నే వాడటం మొదలుపెట్టారు. ఒకదానికి మాత్రమే రీఛార్జ్ చేస్తూ.. మరో సిమ్ ను నామమాత్రంగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి చార్జీలు పెరిగితే మొబైల్‌ కస్టమర్లకు అది మరింత భారంగా మారుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Telecom operators Bharti Airtel, Reliance Jio and Vodafone Idea are set to increase their prepaid tariffs by Diwali 2022.#Jio #Airtel #VI #MobileTarrif #MobileData #Karttoday pic.twitter.com/vwh0VsIQBx

— Karttoday – Tech & Offers (@karttoday) May 31, 2022

20 శాతం ఏఆర్‌పీయూ పెంపు లక్ష్యం

గత ఆర్థిక సంవత్సరం (2021-22) టెలికాం సంస్థల.. ఏఆర్‌పీయూ వృద్ధి 5 శాతంగానే ఉన్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం దీన్ని 15-20 శాతానికి పెంచుకోవాలని సంస్థలు భావిస్తున్నాయి. అందుకే మళ్లీ చార్జీల పెంపు యోచనలో ఉన్నట్టు సమాచారం. అక్టోబర్‌ నుంచి ఈ వడ్డింపులు ఉండవచ్చని అంచనా. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం మూడు ప్రైవేట్‌ టెలికం సంస్థల యాక్టివ్‌ యూజర్లు 3 శాతం పెరిగారని, దీంతో 2.9 కోట్ల మంది వినియోగదారుల నుంచి మళ్లీ ఆదాయం రావడం మొదలైందని క్రిసిల్‌ తెలిపింది. దేశీయ టెలికం రంగంలో ఇప్పుడు ప్రైవేట్‌ రంగం నుంచి రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలుండగా, ప్రభుత్వ రంగం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటీఎన్‌ఎల్‌ మాత్రమే ఉన్నది.

ఇది కూడా చదవండి: మిడిల్ క్లాస్ వాళ్లకు శుభవార్త! 10 వేల EMIతో 30 లక్షలు విలువచేసే ఇల్లు కొనొచ్చు!

ఎయిర్‌టెల్ కంపెనీ ఈ ఏడాది ఏఆర్‌పీయూను రూ.200కు చేర్చాలని లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. గతేడాది డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఏఆర్‌పీయూ రూ.163గా ఉందని తెలుస్తోంది. అలాగే వొడాఫోన్ ఐడియా కూడా ఏఆర్‌పీయూను పెంచుకోవాలని భావిస్తోంది. కాగా టారిఫ్ దరల పెంపు వల్ల జియో, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు వరుసగా ప్రతి నెలా కస్టమర్లను కోల్పోతూ వస్తున్నాయి. అయితే మరి కొంత మంది మాత్రం టారిఫ్ ధరల పెంపు వెంటనే ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. స్పెక్ట్రమ్ వేలం తర్వాత ధరల పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరి.. మరోసారి రీఛార్జ్ ధరలు పెరిగితే.. ఆ భారం సామాన్యుడిపై ఎంతమేర ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Airtel
  • Business News
  • reliance jio
  • telecom companies
  • VODAF
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సిమ్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో మోసం.. డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు!

సిమ్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో మోసం.. డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు!

  • ఎయిర్ టెల్, జియో సేవల్లో తీవ్ర అంతరాయం..!

    ఎయిర్ టెల్, జియో సేవల్లో తీవ్ర అంతరాయం..!

  • రిలయన్స్ జియో మరో సంచలనం.. రూ. 999 ధరకే 4G ఫోన్

    రిలయన్స్ జియో మరో సంచలనం.. రూ. 999 ధరకే 4G ఫోన్

  • Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు ..

    ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు ..

  • జియో సిగ్నల్​ రావడం లేదని గ్రామస్థుల ధర్నా.. మన తెలంగాణలోనే..!

    జియో సిగ్నల్​ రావడం లేదని గ్రామస్థుల ధర్నా.. మన తెలంగాణలోనే..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam