కొత్త సంవత్సరం సందర్భంగా పలు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్లును ప్రకటిస్తున్నాయి. విమానయాన సంస్థలు తక్కువ ధరకే ప్రయాణించే ఆఫర్లు ప్రకటిస్తుంటే.. బైకులు, కార్ల ఉత్పత్తి సంస్థలు వాటిపై కొంతమేర తగ్గింపు ధరను అందిస్తున్నాయి. ఈ తరుణంలో దేశీయ టెలికాం రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భారతీ ఎయిర్‌టెల్ న్యూ ఇయర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ద్వారా ఎయిర్‌టెల్ వినియోగదారులు 50 జీబీ డేటా ఉచితంగా పొందవచ్చు. కాకుంటే.. అందుకు ఆఫర్ ప్రయోజనాలు పొందడానికి ఓ కండీషన్ పెట్టింది.. ఎయిర్‌టెల్.
కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఎయిర్‌టెల్.. ‘వింక్ మ్యూజిక్’ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే యూజర్లకు 5 జీబీ నుంచి 50 జీబీ డేటాను ఆఫర్‌ను అందిస్తోంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే.. వినియోగదారులు ఎటువంటి యాడ్స్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఇలా వివిధ రకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. నెల రోజుల సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే.. 5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీని విలువ రూ. 98. అదే 50 జీబీ డేటా ఉచితంగా పొందాలంటే.. ఏడాది వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని విలువ రూ. 301. అంటే.. ఎవరైతే వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారో వారికే ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది.