విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కంటుంటారు. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. వారి స్తోమతకు తగ్గట్టుగా బస్సు, రైలు ప్రయాణం సాగిస్తుంటారు. అలాంటి వారికి విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా తీపికబురు అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఆ వివరాలు..
మరో వారంలో రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే.. ఇండిగో దేశీయ విమాన ప్రయాణాన్ని రూ.2,023కు, అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని రూ.4,999లు కల్పిస్తోంది. అదే తరహాలో ఎయిర్‌ఏషియా సంస్థ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.1,497గా నిర్ణయించింది. ఈ నెల 25 వరకు అమలులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్‌తో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే.. సీట్లు పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటాయి. ఇది కేవలం లిమిటెడ్ ఇన్వెంటరీ ఆఫర్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గలవారు www.airasia.co.in వెబ్‌సైట్, కంపెనీ మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. బెంగళూరు-కొచ్చి నగరాల మధ్యఈ టిక్కెట్టు ధర వర్తించనుంది.
It’s pouring offers on https://t.co/4gF7kebVg3. Dive in to your travel plans this monsoon with AirAsia India’s #SplashSale fares starting from ₹1497! Book now till 10 July for travel from 26 July 2022 till 31 March 2023. #Hi5Performance #FlySafeWithAirAsia pic.twitter.com/8MoevhO2Yf
— AirAsia India (@AirAsiaIndia) July 7, 2022