గత కొన్ని రోజులుగా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరు మీడియాలో మారు మోగుతుంది. తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్ జాబితా ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నాడు అదానీ. ఇటీవలే.. సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ.. ఈ రంగంలో మరింత విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో భాగంగా.. 5 వేల కోట్ల రూపాయలతో ఓ సిమెంట్ కంపెనీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ రెడీ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌కు సంబంధింఇచన సిమెంట్ యూనిట్‌లను కొనుగోలు చేసుకుందుకు అదానీ గ్రూప్ ఇప్పటికే సదరు కంపెనీతో చర్చలు జరిపినట్లు సమాచారం. సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌తో పాటు ఇతర ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన అదానీ గ్రూపు సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని సమాచారం. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి వెల్లడించాడు.
ఇప్పటికే అదానీ కంపెనీ దేశీయ సిమెంట్ కంపెనీలైన అంబుజ సిమెంట్, ఏసీసీ లిమిటెడ్‌లోని స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసింది. దీంతో ఏటా 67.5 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామార్థ్యం ఉన్న కంపెనీగా అదానీ గ్రూప్ నలిచింది. ప్రస్తుతం సిమెంట్ వ్యాపారంలో ఆదిత్య బిర్లా గ్రూప్ అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా అదానీ గ్రూపు రెండో స్థానంలో నిలిచింది. ఇక రాబోయే ఐదేళ్లలో సిమెంట్ తయారీ సామార్థ్యాన్ని లక్షాన్ని 140 మిలియన్ టన్నులకు పెంచాలని అదానీ గ్రూపు నిర్ణయించికుంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ఇక తాజా జేపీ పవర్ వెంచర్స్‌కు చెందిన సిమెంట్ యూనిట్‌ను కొనుగోలు చేయడం ద్వారా.. అదానీ గ్రూపు సిమెంట్ తయారీ సామార్థ్యం మరింత పెరిగింది. మధ్యప్రదేశ్‌లో ఉన్న జేపీ గ్రూప్ ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామార్థ్యం కలిగి ఉంది. అయితే రుణ భారం పెరగడంతో.. దాన్నుంచి బయటపడటం కోసం సిమెంట్ యూనిట్‌ని విక్రయించాలని నిర్ణయించుకుంది. దీని గురించి ఇప్పటకే ఆ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. ఇక సిమెంట్ యూనిట్ కొనుగోలు నిర్ణయం గురించి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.