ఈరోజుల్లో 1 బీహెచ్కే ఫ్లాట్ అనేవి దొరకడం లేదు. దాదాపు అందరూ 2 బీహెచ్కే ఫ్లాట్స్ నే అమ్ముతున్నారు, కొంటున్నారు. మియాపూర్ లో 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే దగ్గర దగ్గర రూ. 50 లక్షలు అవుతుంది. కానీ మియాపూర్ కి దగ్గరలో కొనడం వల్ల రూ. 14 లక్షల నుంచి రూ. 15 లక్షలు ఆదా అవుతాయి.
హైదరాబాద్ మహా నగరం నానాటికి విస్తరిస్తోంది. ఈ కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలు నివాస స్థలాలకు అనుకూలంగా మారుతున్నాయి. నార్త్ హైదరాబాద్ లో ఉన్న కూకట్ పల్లి, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ వంటి ఏరియాల్లో 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కనీసం 45 లక్షల నుంచి రూ. 50 లక్షల పైనే పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇదే నార్త్ హైదరాబాద్ లో 36 లక్షల బడ్జెట్ లో మంచి ఏరియాలో ఫ్లాట్స్ ఉన్నాయి. మియాపూర్ నుంచి 20 కి.మీ. లోపు దూరంలో ఉంది ఈ ఏరియా. ఈ ఏరియాలో తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్స్ ని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు విక్రయిస్తున్నాయి. మీరు కనుక తక్కువ పెట్టుబడి పెట్టి ఫ్యూచర్ లో లాభాలు పొందాలి అనుకుంటున్నా లేదా బడ్జెట్ లో ఫ్లాట్ తీసుకుని కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా జీవించాలని అనుకున్నా గానీ ఈ ఏరియా చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇస్నాపూర్ లో ఉన్న పచ్చని, నిర్మలమైన ప్రదేశాలు బయ్యర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరువుకి చాలా దగ్గరలో ఉంది ఇస్నాపూర్. ప్రకృతి కేంద్రీకృత ప్రదేశమైన ఇస్నాపూర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ లో నెమ్మదిగా కీలక పాత్ర పోషిస్తుంది. ఐటీ హబ్ కి సమీపంలో ఉన్న ఈ ఏరియా మోడర్న్ ఫ్యామిలీస్ కి ఐడియల్ ప్లేస్ గా ఉంటుంది. ఇస్నాపూర్ లో ఫ్లాట్స్ మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. ఇస్నాపూర్ లో నాణ్యమైన విద్యనందించే విద్యాసంస్థలు, హెల్త్ కేర్ సెంటర్లు, అలానే షాపింగ్ కేంద్రాలు, వినోద కేంద్రాలు ఉన్నాయి. ఇస్నాపూర్ లో ఫ్లాట్స్ కొనడం గానీ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టడం గానీ ఎందుకు అని అంటే కనుక.. ఈ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రకృతిని కలిగి ఉంది.
ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ ని మెయింటెయిన్ చేయాలనుకునేవారికి ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్ కి తదుపరి ఉత్తమ రెసిడెన్షియల్ హబ్ గా ఇస్నాపూర్ అంతటి పొటెన్షియల్ కలిగి ఉందని కొనుగోలుదారులకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ బడ్జెట్ లోపే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ధరలు పెరిగిపోతాయి. ఇస్నాపూర్ లో ఇప్పుడు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. మియాపూర్ కి 18 కి.మీ. దూరంలో, పటాన్ చెరువుకి 6 కి.మీ. దూరంలో ఉన్న ఇస్నాపూర్ లో రూ. 36 లక్షల బడ్జెట్ లో 2 బీహెచ్కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3కి కేవలం 8 నిమిషాల్లో చేరుకోగల దూరంలో కొత్త టవర్ ప్రారంభం కానుంది. ఈ టవర్ లో పలు ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి. ఈ ఏరియాలో బిల్డర్లు కాకుండా ఓనర్లు అమ్మే ఫ్లాట్స్ కూడా ఉన్నాయి.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.