మీరు కనుక స్థలం కొని ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే కనుక హైదరాబాద్ కి అతి దగ్గరలో ఉన్న ఈ ఏరియా ఉత్తమమైన ఛాయిస్ అని చెప్పవచ్చు.
హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? సిటీకి దగ్గరలో స్థలం కొనాలని భావిస్తున్నారా? హైదరాబాద్ నుంచి 25 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఏరియాలో పెట్టుబడి పెడితే లాభాలను పొందవచ్చు. గడిచిన పదేళ్లలో 414 శాతం ఇక్కడ భూముల ధరలు పెరిగాయి. ఆ ఏరియా పేరు ఘట్ కేసర్. ఈ ఏరియాలో ఆఫీస్ స్పేస్ లు, కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ఆస్తులు, కో లివింగ్ స్పేస్ వంటి వాటి కోసం పలు ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఐటీ కంపెనీలు మరింత విస్తరించడానికి హైదరాబాద్ కి దగ్గరగా ఉన్న ఘట్ కేసర్ ని అనువైన ప్రదేశంగా ఎంచుకున్నాయి. ఈ కారణంగా పలు ఐటీ కంపెనీలు ఈ ఏరియాలో స్థలాల మీద పెట్టుబడులు పెట్టాయి. ఇన్ఫోసిస్ కంపెనీ 450 ఎకరాలను సొంతం చేసుకుంది. ఇక్కడ ఐటీ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోంది.
మైండ్ స్పేస్ ఐటీ పార్క్ కూడా 150 ఎకరాల స్థలం కలిగి ఉంది. ఐబీఎం, ఎసెంచర్, జెన్పాక్ట్ వంటి కంపెనీలు ఈ ఏరియా నుంచి సంస్థ కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తున్నాయి. ఈ కారణంగా ఘట్ కేసర్ లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. అప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. భూముల డిమాండ్ అనేది పెరుగుతుంది. 2007లో చదరపు అడుగు రూ. 400 ఉంటే ఇప్పుడు రూ. 1800 అయ్యింది. దాదాపు 16 ఏళ్ళు అయ్యింది. ఈ 16 ఏళ్లలో 414.3 శాతం పెరిగింది. ఐదేళ్ళలో 125 శాతం పెరిగితే.. మూడేళ్ళలో 28.6 శాతం, గత ఏడాదిలో 9.1 శాతం పెరిగింది. ఘట్ కేసర్ లో సగటున చదరపు అడుగు స్థలం రూ. 1800 ఉంది. చదరపు అడుగు రూ. 1100 నుంచి రూ. 2500 రేంజ్ లో ఉన్నాయి.
ఈ ఏరియాలో స్థలం కొనాలనుకుంటే కనుక గజం రూ. 16,200 చొప్పున 100 గజాలకు రూ. 16,20,000 అవుతుంది. ఈ స్పేస్ లో 2 బీహెచ్కే ఇల్లు కట్టుకోవచ్చు. 150 గజాల స్థలానికి ఐతే రూ. 24,30,000 అవుతుంది. ఇదే ఏరియాలో బిల్డర్ కట్టిన ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగుకి రూ. 3500 అవుతుంది. అంటే 100 గజాల్లో ఫ్లాట్ కావాలనుకుంటే రూ. 31 లక్షలు అవుతుంది. అదే 150 గజాల్లో కావాలనుకుంటే రూ. 47 లక్షలు అవుతుంది. ఐతే ఫ్లాట్ కొనుక్కోవడం కంటే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవడం ఉత్తమం. రూ. 16 లక్షల నుంచి రూ. 18 లక్షలు పెట్టి 100 గజాల స్థలం కొనుక్కున్నా.. ఇంకో 15, 20 లక్షలు పెట్టి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చు. ఎవరితో సంబంధం లేకుండా ఇండివిడ్యువల్ ఇంటిలో సుఖంగా ఉండవచ్చు. కాబట్టి పెట్టుబడికి ఘట్ కేసర్ ప్రాంతం ఉత్తమమని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.