‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ప్రేక్షకులను బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ విధానంతో హౌస్ లో కంటెంట్ బాగా క్రియేట్ అవుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ గనుక కాస్త ఆసక్తిగా ఉండేలాగానే ప్లాన్ చేశారు. ప్రతి విషయంలో పోటీ, టాస్కులో పంతాలు హైలెట్ గా నిలుస్తున్నాయి. వారియర్స్ నుంచి అఖిల్, తేజస్వి, నటరాజ్ మాస్టర్, మహేశ్ విట్ట.. ఛాలెంజర్స్ నుంచి బిందు, యాంకర్ శివ, ఆర్జే చైతు గొడవలకు దిగుతున్నారు. వారి మధ్య చర్చలు, గొడవలు అన్నీ నెక్ట్స్ లెవల్లో ఉంటున్నాయి.
ఇదీ చదవండి: స్మోకింగ్ జోన్ గా బిగ్ బాస్ హౌస్! తేజస్వి ఏంటి ఈ రచ్చ?
హౌస్ కెప్టన్సీ పోటీదారుల టాస్కు తగ్గేదేలేలో అందరూ అనుకున్నట్లుగానే వారియర్స్ ను చిత్తుచేసి ఛాలెంజర్స్ జెండా ఎగరేశారు. కెప్టెన్సీ పోటీదారులుగా ఛాలెంజర్స్ నుంచి శివ, అనీల్, శ్రీ, చైతు ఉండగా.. వారియర్స్ నుంచి అరియానా, హమీదా వచ్చారు. నామినేషన్స్ లో ఉన్న వారికే కెప్టెన్సీ పోటీదారుగా ఉండేలా మాట్లాడుకుని అలా డిసైడ్ అయ్యారు. అయితే ఈ వారం హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతోందనే టాక్ బాగా వినిపిస్తోంది. నిన్నటి వరకు లీస్ట్ పొజిషన్ లో ఉన్న కంటెస్టెంట్లు పైకి వెళ్లడంతో వారియర్స్ లో ఉన్న ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లు ఇరకాటంలో పడ్డట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆసక్తికర బిగ్ బాస్ ఓటీటీ కథనాల కోసం క్లిక్ చేయండి.
ఈ వారం నామినేషన్స్ లో శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, అషురెడ్డి, సరయు, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా, అరియానా, నటరాజ్ మాస్టర్, అఖిల్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఛాలెంజర్స్ కంటెస్టెంట్లు ఓటింగ్ లాస్ట్ లో ఉండగా గురువారం ఓటింగ్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఛాలెంజర్స్ ఓటింగ్ పైకెళ్లగా.. మహేశ్ విట్ట, నటరాజ్ మాస్టర్ జాబితాలో చివరికి చేరినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఈ వారం హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ తప్పదనే టాక్ వినిపిస్తోంది. నిన్నటి వరకు కూడా శ్రీ రాపాక ఎలిమినేట్ కావచ్చు అనే టాక్ వచ్చింది. ఇప్పుడేమే ఓటింగ్ విషయంలో భారీ మార్పులు జరిగాయని తెలుస్తోంది. మరి అసలు ఎలిమినేషన్ ఎవరని తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.