బిగ్ బాస్ రియాలిటీ షోలో రోజులు గడుస్తున్నకొద్దీ వారి అసలు నిజస్వరూపాలు బయటపడుతున్నాయి. మొదట్లో నెగటివ్ ఒపీనియన్ బయటపెట్టిన ప్రేక్షకులు వారి గురించి పూర్తిగా తెలిసేసరికి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ ఫ్యాన్స్ లో కొత్త మార్పు కనిపిస్తోంది. అయితే.. గడిచిన బిగ్ బాస్ 5 సీజన్స్ లో కూడా టైటిల్ విన్నర్స్ మేల్ కంటెస్టెంట్స్ అయ్యారు.
ఈసారైనా లేడీ కంటెస్టెంట్ కొడుతుందేమో చూడాలని అనుకుంటున్నారు. ఇక టైటిల్ కొట్టబోయేది నేనే అంటూ హౌజ్ లో అడుగుపెట్టిన యాంకర్ స్రవంతి 6వ వారం ముమైత్ తో కలిసి ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేషన్ తర్వాత స్రవంతి హౌస్ లోని కంటెస్టెంట్స్ గురించి తెలియని విషయాలను చెప్పింది. “రిస్క్ చేసే బిగ్ బాస్ కి వెళ్లాను. బాబు ఫీజ్ కట్టాలి. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి. 20-30 లక్షల అప్పు ఉంది. ఆ టైంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది” అని చెప్పిన స్రవంతి.. మిత్రా శర్మ గురించి చాలా విషయాలు బయట పెట్టింది.
బయట అనుకుంటున్నట్టుగా మిత్రాశర్మ నెగటివ్ కాదని.. ఆమె చాలా పాజిటివ్ అని చెప్పింది. అదేవిధంగా తన గురించి వేరేలా అనుకున్నా కానీ తాను నాకు ఫైనాన్సియల్ గా సహాయం చేస్తానని చెప్పింది. ఎలిమినేషన్ తర్వాత మిత్రాశర్మకి కూడా హగ్ అని.. ఆమె మంచి మనసు గురించి చెప్పుకొచ్చింది స్రవంతి.
ఆమె మాట్లాడుతూ.. “మా ఇద్దరి మధ్య ఓ విషయం జరిగింది. నా పర్సనల్ స్టోరీ చెప్పినప్పుడు నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుని.. వెంటనే నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది. ఇస్తుందో లేదో తెలియదు కానీ.. నాకైతే మాట ఇచ్చింది. తనతో వర్క్ చేసే ఒక అమ్మాయికి రూ.10 లక్షలు పెట్టి పెళ్లి చేసానని.. తన ఇంట్లో పని అమ్మాయికి రూ.10 లక్షలు పెట్టి పెళ్లి చేశానని మిత్రా చెప్పింది. ఆమె నాకు ఇవ్వాలని రూల్ కూడా లేదు. కానీ నాతో క్లోజ్ గా ఉన్నవాళ్లే నన్ను గుర్తించలేదు. మిత్రా గుర్తించి హెల్ప్ చేస్తానంది” అంటూ మిత్రా శర్మ గురించి చెప్పింది. ప్రస్తుతం స్రవంతి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మిత్రాశర్మ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.