బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకుల వద్ద ఊహించినంత ఆదరణ పొందలేకపోయిందనే చెప్పాలి. రెగ్యులర్ బిగ్ బాస్ తో పోలిస్తే చాలా తక్కువ రెస్పాన్స్ వస్తోందని టాక్ వినిపిస్తోంది. ఆదివారం నాగార్జున ఎపిసోడ్ కోసం తప్పితే 24*7 లైవ్ కోసం ఎదురుచూస్తున్న దాఖలాలు ఉండటం లేదు. నిన్న జరిగిన ఘటనలను ఈరోజు లైవ్ పేరుతో నాన్ స్టాప్ అంటూ ప్లే చేయడమే అందుకు ప్రధాన కారణం కావచ్చు. ఎలిమినేషన్ రోజు కోసం మాత్రం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత అంత ఉత్సుకతతో ఎదురుచూసేది నామినేషన్స్ రోజు కోసమనే చెప్పాలి. ఎందుకంటే ఆరు రోజులు దోస్త్ మేరా దోస్త్ అని గడిపిన ఇంట్లోని సభ్యులు సోమవారం రాగానే ఆరోపణలతో కత్తులు దూస్తుంటారు.
ఇదీ చదవండి: సింగర్ పార్వతి ఇంత త్వరగా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు!
ఈ వారం నామినేషన్స్ మరీ పీక్స్ కు చేరుకున్నాయనే చెప్పాలి. ప్రతివారం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టే బిగ్ బాస్ ఈ వారం కూడా అదే తరహాలో కాన్సెప్ట్ తో బిగ్ బాస్ ఇంట్లో వాతావరణాన్ని వేడెక్కించాడు. దిష్టిబొమ్మలు పెట్టి వాటిపై కుండలు పెట్టి బ్యాట్ తో బద్దలు కొట్టాల్సిందిగా ఆదేశించాడు. ఇంకేముంది ఇంట్లోని సభ్యులు అంతా వారి కారణాలను చెబుతూ ఈ ఆరు రోజులు దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కారు. ఈసారి బిందు- యాంకర్ శివ మధ్య కూడా వైరం మొదలైనట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు చెప్పకుండా ఇక్కడే ఎందుకు చెబుతున్నావంటూ శివ ప్రశ్నించాడు. ఆ మాట నన్ను బాధపెట్టిందంటూ బిందు సీరియస్ అయ్యింది.
ఇంక నామినేషన్స్ పర్వంలో నటరాజ్ మాస్టర్– అరియానా మధ్య ఓ పెద్ద మాటల యుద్ధమే జరిగింది. గేమ్ కు సంబంధించి తన కుమార్తెపై ఒట్టు వేయాలని అరియానా అడగడాన్ని నటరాజ్ మాస్టర్ తప్పుబట్టారు. గేమ్ కోసం అరియానా అంత దిగజారిపోతావా? అంటూ ప్రశ్నించాడు. అందుకు అరియానా కోపంతో ఊగిపోయింది. గేమ్ ఇంపార్టెంట్ అని మీరే చెప్తారు కదా? దిగజారిపోయానంటా.. సిగ్గులేని మనిషి అంటూ అరియానా కేకలు పెట్టేసింది. ఇప్పుడైనా మీరు అనలేదని మీ పాప మీద ఒట్టేయండి మాస్టర్ అంటూ అడిగింది. అందుకు నటరాజ్ మాస్టర్ మళ్లీ ఇంత దిగజారిపోతావా అంటూ రెచ్చిపోయాడు. కుండ బద్దలు కొట్టి చివరకు తన నామినేషన్ ను కంప్లీట్ చేశాడు. నటరాజ్ మాస్టర్- అరియానా మధ్య గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.