బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అంటేనే ప్రస్తుతం గొడవలు, కేకలు కనిపిస్తున్నాయి. ఒక్కే వారం ఒకళ్లు బయటకు వెళ్తుంటే ఇంట్లో వాతావరణం వేడెక్కుతోంది. ఇటీవల తేజస్వి మడివాడ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మందికి చురకలు అంటించింది. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ పై తీవ్ర విమర్శలు చేసింది. హౌస్ లో ఒక్క తేజస్వినే కాదు.. ఆయనంటే చాలా మందికి పీకల దాకా కోపం ఉంటుంది. చాలా మంది ఆయన ప్రవర్తన మారాలంటూ అన్నారు. ఎక్కువగా నచ్చని వాళ్లు ఉన్నారంటే వారిలో బిందు మాధవి, అనీల్, యాంకర్ శివ పేర్లు చెప్పచ్చు. సోమవారం జరిగిన నామినేషన్స్‌లోనూ అనీల్ నటరాజ్ మాస్టర్ కు గొడవ జరిగింది.
ఇదీ చదవండి: నటరాజ్ మాస్టర్ పై తేజస్వి సంచలన వ్యాఖ్యలు!
నటరాజ్ మాస్టర్ ను ఎవరు నామినేట్ చేసినా కూడా తట్టుకోలేడు. వెంటనే అక్కడే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే అనీల్ తోనూ గొడవ జరిగింది. ఆ తర్వాత బిందు మాధవితోనూ అదే ధోరణి. తనను నామినేట్ చేయగానే కోపంతో ఊగిపోతారు. నువ్వు నోటికొచ్చినట్లు తిడుతావు వెళ్లిపోతావు అని బిందు మాధవిని నటరాజ్ మాస్టర్ అనగానే.. అందుకు ఆమె నేను ఆ అంటే మీరు ఆహా అంటారు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత మాటలు పెరిగి నీకు మాట్లాడే దమ్ములేదా అంటూ నటరాజ్ మాస్టర్ ను ప్రశ్నించింది. అందుకు మాస్టర్ నేను మాట్లాడితే ఇంకోలా ఉంటుంది అంటూ ఎప్పటిలాగానే సమాధానం ఇచ్చారు. నటరాజ్ మాస్టర్- బిందు మాధవి గొడవలో తప్పు ఎవరది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.