బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. 24 గంటల్లో ఇంట్లోని సభ్యులు ఎక్కువ గంటలు కొట్లాడుకోవడానికే సరిపోతూ ఉంది. తాజాగా కెప్టెన్సీ టాస్కులో నానా రచ్చ జరగింది. ఈ వారం కెప్టెన్ గా నటరాజ్ మాస్టర్ గెలిచారు. వారియర్స్ అంతా కలిసి కట్టుగా నటరాజ్ మాస్టర్ ను గెలిపించుకున్నారనే చెప్పాలి. ఆ క్రమంలో ఛాలెంజర్స్ వైపు నుంచి కూడా గట్టిగానే పోటీ ఎదురైంది. శివను కెప్టెన్ గా చేసేందుకు బిందు మాధవి హౌస్ మొత్తంతో గొడవ పడినట్లుగా కనిపిచింది. ఒక సందర్భంలో అఖిల్ తో పెద్ద గొడవే అయ్యింది.
ఇదీ చూడండి: అఖిల్, బిందు మాధవిల మధ్య మాటల యుద్ధం..!
నాతో గొడవ ఏమైనా ఉంటే ముఖం మీద చెప్పు అంటూ అఖిల్ చెప్పాడు. ఇష్టం వచ్చ స్టేమెంట్స్ పాస్ చేయకు అంటూ చెప్పాడు. అందుకు బిందు నువ్వు అనే దానికే నేను చెప్తున్నాను అంటూ కామెంట్ చేసింది. నన్ను ఆడ అని నాలుగుసార్లు అన్నావ్ అంటూ అఖిల్ ఏడ్చేశాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు. అజయ్, స్రవంతి, అషురెడ్డి కూల్ చేశారు. అషు అయితే శివను బిందు ముంచేస్తుంది అంటూ అనేసింది. ‘ఫ్రెండ్ అని ముందు పెట్టుకుంటున్నాడు. ఏదొకరోజు వాడిని ముంచేసి ముందుకెళ్తుంది. నామినేషన్స్ లో చెప్పింది కదా. వాడి గురించి.’ అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఈ కెప్టెన్సీ టాస్క్ మాత్రం గట్టిగానే గొడవలు పెట్టింది.
బిందు వారియర్స్ కు పంటి కింద రాయిలా తయారైంది. ఆర్జే చైతు తర్వాత ఇప్పుడు వారియర్స్ కు పోటీగా ఉంది బిందు, శివ అనే చెప్పాలి. అజయ్ ఉన్నా కూడా అతను అఖిల్ పార్టీ అనే చెప్పాలి. అఖిల్ కోసమే తన గ్రూప్ శివను ఓడిపోయేలా చేశాడు. అయితే ఇంట్లో నాలుగో వారం ముగిసే సమయానికి రాజకీయాలు బాగానే వేడెక్కాయి. మరి నటరాజ్ మాస్టర్ కెప్టెన్సీ ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి. బిందు మాధవి.. సీనియర్స్ ను ఎదిరించి గెలవగలదా? మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.