ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్స్ బ్రేకప్ లవ్ స్టోరీలే నడుస్తున్నాయి. వాటిలో బోల్డ్ బ్యూటీ అషురెడ్డి స్టోరీ కూడా ఉంది. 20 ఏళ్ల వయసుల్లో ఓ అబ్బాయిని ప్రేమించినట్లు.. ఆ తర్వాత అతను తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మాయనే పెళ్లి చేసుకున్నాడంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇంకెవరికీ తనని హర్ట్ అవకాశం ఇవ్వలేదంది అషు. అసలు ఆమె బ్రేకప్ స్టోరీ ఏంటంటే..
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లో మందేసి చిందేసిన యాంకర్ శివ!
‘నాకు 20 ఇయర్స్ ఏజ్ లో ఓ అబ్బాయిని ప్రేమించాను. నేను కూల్ డ్రింక్స్ కంపెనీలో ఇంటర్న్ షిప్ చేస్తుండేదానిని. ఆ టైమ్ లో సీక్రెట్ కలిసేదానిని. కలిసినప్పుడల్లా నా నుదురు మీద ముద్దుపెట్టేవాడు. తన తలను అలా ఇలా నిమురుతూ ఉండేవాడు. కొన్నిరోజుల తర్వాత ఆ విషయం ఇంట్లో తెలిసిపోయింది. నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్లు మా ఇంటికి వచ్చి మా వాళ్లతో మాట్లాడారు. ముందు నన్ను యూఎస్ వెళ్లి ఎంబీఏ పూర్తి చేసి రమ్మన్నారు. ఇద్దరం ఒకే కాలేజ్ లో అప్లై చేశాం. ఇద్దరికీ వీసాలు వచ్చాయి. నేను వెళ్లిపోయాను కాలేజ్‌కి. వాడు మాత్రం రాలేదు.’
తర్వాత మొత్తం ఏడు నెలల పాటు గొడవలతోనే మా రిలేషన్ సాగిపోయింది. ఆ తర్వాత ఒకసారి విసిటింగ్ వీసా మీద అమెరికా వచ్చాడు. కలిసాడు.. స్టడీ వీసా ఎందుకు తీసుకోలేదో నాకు తెలీదు. మా గొడలు మొత్తం నా బెస్ట్ ఫ్రెండ్ లా ఒక అమ్మాయి ఉండేది. ఆమెతో చెప్తుండేవాడిని. ఆమె మమ్మల్ని కలిపేందుకు ట్రై చేసేది. తర్వాత వైజాగ్ వచ్చాను.. వెళ్లి కలిశాను. అప్పటిలా నుదురు మీద ముద్దు పెట్టడం, తల నిమరడం లాంటివి ఏం చేయలేదు. నాకు అర్థమైపోయింది.. దూరం పెరిగిందని. అతను ఇంకెవరినో ఇష్టపడుతున్నాడని అర్థమైంది. వాళ్ల పేరెంట్స్ మా పేరెంట్స్ పెళ్లికి ఓకే చెప్పారు. కానీ, ఆ బ్లేమ్ నా మీద వేసుకుని నేను పెళ్లికి నో చెప్పాను.
ఇదీ చదవండి: హీరోయిన్ భావన కిడ్నాప్, దాడి కేసులో ప్రముఖ నటికి సమన్లు..
ఆ తర్వాత వాడి లైఫ్ లో ఎవరున్నారో తెలుసుకోవాలి అనుకున్నాను. ఈ విషయాలు చెప్పిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ ఈ సారి బ్రేకప్ చెప్పమంది. నేను బ్రేకప్ చెప్పేశాను. ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో వెళ్లి మాట్లాడదాం.. ఎలాగైనా మళ్లీ రిలేషన్ కంటిన్యూ చేద్దామని భావించాను. చెప్పులు చేతులో పట్టుకుని వాడి కార్ వెనకాల హాఫ్ మైల్ పరిగెత్తాను. తర్వాత ఇంటికి వెళ్లి షవర్ లో కూర్చుని ఏడ్చాను. తర్వాత బిగ్ బాస్ కి వెళ్లాను. బయటకు వచ్చే సరికి వాడికి పెళ్లైంది. వాడు చేసుకుంది ఎవరినో కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్ ని. అది తెలిసి షాకయ్యాను. ఇంక వాళ్లతో మాట్లడటం మానేశాను. ఇంక ఎవరికీ నన్ను హర్ట్ చేసే అవకాశం ఇవ్వలేదు’ అంటూ అషురెడ్డి తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. అషు లవ్ బ్రేకప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.