బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ దెబ్బకు కయ్యాలు, కొట్లాటలతో సాగుతోంది. అయితే నాలుగో వారం హౌస్ నుంచి 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఎలిమినేషన్ తర్వాత యాంకర్ రవికి ఇచ్చిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది. ముఖ్యంగా అఖిల్ టీమ్ పై విరుచుకుపడింది. మరోవైపు అషురెడ్డికి కూడా గట్టిగానే చురకలు అంటించింది. హౌస్ లో వాళ్లంతాగ గ్రూప్ అంటూ ఒక రేంజ్ లో విరుచుకుపండిది. ఇంకా ఇంట్లో హిందీ సీరియల్ నడుస్తోంది అంటూ ఎద్దేవా చేసింది.
ఇదీ చదవండి: బిగ్ బాస్ నుంచి 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ కావడానికి కారణాలు!
‘నేను ఎలిమినేట్ కావాల్సింది కాదు. వేరే వాళ్ల బదులు నన్ను బలిచేసి పంపేశారు. అఖిల్, అషు, అజయ్, స్రవంతి అంతా ఒక టీమ్ గా గేమ్ ఆడుతున్నారు. వాళ్లు ఎవరితో కలవరు, వాళ్లు ఎవరినీ కలవనివ్వరు. అఖిల్ ని గెలిపించడం కోసం వీళ్లు ముగ్గురూ ఆడుతున్నారు. వాళ్లంతా చిల్లర వేషాలు వేస్తున్నారు. ముఖ్యంగా అషురెడ్డి ఎక్కువ చిల్లర వేషాలు వేస్తోంది. అఖిల్ ని ఎవరు ఏ మాట అన్నా కూడా అమె వచ్చేస్తుంది. అఖిల్ కు తాను భార్య అనే రేంజ్ లో ప్రవర్తిస్తోంది’.
‘అజయ్ ని కెప్టెన్ చేసేందుకు సిల్లీ రీజన్స్ చెప్పి నన్ను తప్పించారు. నామినేషన్స్ లోనూ సిల్లీ రీజన్స్ చెప్పి వాళ్లంతా ఒకరినే టార్గెట్ చేస్తారు. హౌస్ లో ఓ హిందీ సిరియల్ నడుస్తోంది. పెద్దన్న, చిన్నన్న, అమ్మ, వదిన(అజయ్, అఖిల్, స్రవంతి, అషు) వీళ్లతో ఓ హిందీ సీరియల్ నడుస్తోంది. స్రవంతికి అజయ్ పెద్ద కొడుకు, అఖిల్ చిన్న కొడుకు, అషు పెద్ద కోడలు. ఇంకా కొద్ది రోజుల్లోనే పాపం అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోబోతోంది’ అంటూ సరయు తన మనసులోని మాటలను బయటపెట్టింది. ఇంట్లో ఎవరి వల్లైతే తనకు ఇబ్బంది అనిపించిందో వారందరినీ ఇంటర్వ్యూలో గట్టిగానే కడిగేసింది. సరయు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.