బిగ్ బాస్ ఫైనల్ స్టేజీకి వచ్చేసింది. మరో మూడు రోజుల్లో ఈ సీజన్ కంప్లీట్ అయిపోనుంది. వచ్చే ఆదివారం అంటే డిసెంబరు 18న ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇప్పటికే విన్నర్ కు సంబంధించిన ఓటింగ్స్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మరోవైపు గతవారం ఇనయా ఎలిమినేట్ అయింది. అదే టైంలో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ఈసారి ఫైనల్ కు ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని షాకిచ్చారు. అంటే ఈ రోజు(గురువారం) ప్రస్తుతం ఉన్న ఆరుగురిలో ఒకరు ఇంటినుంచి బయటకెళ్లిపోతారు. ఆ వ్యక్తి ఎవరా అని ఆడియెన్స్ ఒకటే టెన్షన్ పడుతున్నారు. అయితే ఇనయా ఎలిమినేషన్ అయినప్పుడే చాలామంది షాకయ్యారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన ఆమెకు ఓట్లు బాగానే పడ్డాయి. కానీ ఆమె హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. దీన్నిబట్టి చూస్తుంటే బిగ్ బాస్ నిర్ణయమే అల్టిమేట్ అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇనయా ఎలిమినేట్ కాగానే హౌస్ట్ నాగార్జున, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రేక్షకులతో చెప్పారు. కానీ హౌసులో ఉన్న రేవంత్, రోహిత్,శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్యలకు ఈ విషయం తెలియదు. మూడు రోజుల్లో ఫినాలే ఎపిసోడ్ ఉంది. మన అందరం ఫైనలిస్టులమే ఆనే ఆలోచనలో వాళ్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్లకే షాకివ్వాలని బిగ్ బాస్ టీమ్ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఉన్నవారిలో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ప్రస్తుతం టాప్-3లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన రోహిత్, కీర్తి, శ్రీసత్యలో ఇద్దరికి మాత్రమే ఫినాలేకు వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం ఓటింగ్ పర్సంటేజ్, బిగ్ బాస్ లెక్కల ప్రకారం చూస్తుంటే రోహిత్, కీర్తి ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. శ్రీసత్య మాత్రం డేంజర్ జోన్ లో ఉంది. దీన్నిబట్టి ఆమెనే హౌస్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బయటకు పంపించేశారని సమాచారం.
ప్రస్తుత ఇంట్లో ఉన్న ఆరుగురిలో శ్రీసత్యపైనే మొదటి నుంచి నెగిటివిటీ వస్తూనే ఉంది. కారణాలు ఏంటనేది పక్కనబెడితే ఆమె సేవ్ అవుతూ ఫినాలే వరకు వచ్చేసింది. ఇనయా, కీర్తిలపై ఆమె వ్యక్తిగతంగా బాధపెట్టడం.. ఫిజికల్ గా హేళన చేయడం, అర్జున్ కల్యాణ్ ని గేమ్ కోసం వాడుకోవడం లాంటివి చేసి, ఆడియెన్స్ ని డిస్ట్రబ్ చేసింది. ఈ క్రమంలోనే రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తిలతో పోల్చి చూసుకుంటే.. శ్రీసత్యనే ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో మొదటి నుంచి క్రేజ్ పరంగా రేవంత్ టాప్ లో ఉన్నారు. కానీ గత మూడు వారాల నుంచి మాత్రం రోహిత్, తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. శ్రీసత్య ఎలిమినేట్ అయిందనే వార్తలపై మీరేం అనుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
NO MATTER WHAT
U’r the REAL WINNER For Me
Queen 👑 SRISATYA ❣️#srisatya#BiggBossTelugu6 pic.twitter.com/BiyXmrZoqF— prasanth (@prasant44062282) December 15, 2022