బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం హౌస్‌లో ‘అడవిలో ఆట’ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కు నడుస్తోంది. ఈ టాస్కులో హౌస్ మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. సగం మంది దొంగలుగా సగం మంది పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. దొంగలకు ఆర్జే సూర్య నాయకత్వం వహిస్తుండగా.. పోలీసులకు యూట్యూబర్ ఆదిరెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు. ఆట మొదలైన దగ్గరి నుంచి హౌస్‌లో రచ్చ షురూ అయ్యింది. అంతా గెలుపు కోసం పోరాడుతున్నారు. ఎలాగైనా గెలవాలి కెప్టెన్సీ కంటెండర్ కావాలనే కసితో ఆడుతున్నారు. అందరితో పోలిస్తే శ్రీ సత్య, గీతూ, రేవంత్, శ్రీహాన్, అర్జున్ కల్యాణ్ బాగా ఆడుతున్నట్లు కనపిస్తోంది. అయితే ఎవరు బెస్ట్ అవుతారనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.
గేమ్‌లో రేవంత్ స్ట్రాటజీలు ప్లే చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే రేవంత్‌ని ఢీకొట్టేందుకు నేహా చౌదరి డిసైడ్ అయిపోయింది. రేవంత్ దాచిపెట్టిన బొమ్మలు ఎక్కడున్నాయో తనకు తెలుసని, వాటిని తీసుకునేందుకు తాను ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది. చెప్పడమే కాదు రేవంత్‌కు సంబంధించిన ఆరు బొమ్మల వరకు నేహా చౌదరి కాజేసింది. అలా చేయడం వల్ల రేవంత్ తన దొంగల టీమ్ మీదే ఫైర్ అయ్యాడు. తన టీమ్‌లోని వాళ్లే బొమ్మలు కాజేయడంతో రేవంత్ తట్టుకోలేకపోయాడు. తిరిగి పోలీసులకు సహాయం చేయడం ప్రారంభించాడు. పోలీసుల టీమ్‌ను రేవంత్ గెలిపించాడు అని కూడా తెలుస్తోంది. ఇదంతా నేహా చేసిన పని వల్లే జరిగింది. పోలీసుల జట్టు కలిసి కట్టుగా ఆడుతుంటే.. దొంగలు మాత్రం సంయమనం పాటించకుండా ఓటమి పాలయ్యారు.
అయితే అసలు మిత్రులుగా ఉన్న నేహా చౌదరి- రేవంత్ మధ్య ఎందుకు చెడిందని అందరికీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా వారి మధ్య వైరం నడుస్తోంది. రేవంత్ తనను పునుగులు, నూడుల్స్ అంటూ పేర్లు పెట్టి పిలవడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నామినేషన్స్ లోనే ఆ విషయాన్ని బయటపెట్టి రేవంత్‌ని నామినేట్ చేసింది. తాను ఒక ఫెమినిస్ట్ గా నిరూపించుకోవాలని రేవంత్ తాపత్రయ పడుతున్నాడంటూ విమర్శించింది. పైకి అలా నటిస్తూనే సందర్భం వచ్చినప్పుడు ఆడవాళ్ల మీద కేకలు వేస్తూ, వారికి ఇలాంటి పేర్లు పెడుతుంటాడంటూ నేహా చౌదరి మండిపడింది. నామినేషన్స్ తర్వాత రోజు ఉదయం నేహా ఏడుస్తూ కనిపంచడంతో చంటి, బాలాదిత్య, సుదీపా పింకీలు ఓదార్చారు. ఆ సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
అయితే ముఖ్యంగా రేవంత్ పేర్లు పెట్టడం, చెప్పింది వినకపోవడం వల్లే వీళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయని అందరూ అనుకుంటున్నారు. అయితే అంతకముందు నుంచే వీరి మధ్య వైరం స్టార్ట్ అయ్యింది. రేవంత్ ఓడిపోయిన టాస్కుకి నేహా చౌదరి సంచాలక్‌గా వ్యవహరించింది. ఆ సమయంలో ఆమె సరిగ్గా చేయకపోవడం వల్లే తాను ఓడిపోయాను, నేహా చౌదరి సంచాలక్‌గా సరిగ్గా చేయలేదంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా అనడమే కాకుండా ఆమె చెప్పిన మాట వినకుండా వెళ్లిపోతాడు. అప్పుడు ఆమె నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తావంటూ సీరియస్ అయ్యింది. అప్పటి నుంచి వీళ్ల మధ్య ఇన్ డైరెక్ట్ వార్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ బొమ్మల టాస్కుతో డైరెక్ట్ అయ్యింది. రేవంత్ vs నేహా చౌదరి గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.