బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది. ఇప్పటికే యాజమాన్యం దాదాపు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంట్లోకి వెళ్లబోయే సభ్యులు క్వారంటైన్‌లో కూడా ఉన్నారని చెబుతున్నారు. ఈసారి సభ్యుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా.. మంచి ఫేమ్ ఉన్నవారిని తీసుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ లిస్ట్ లో అందరినీ ఆకట్టుకుంటున్న, ఆసక్తికి గురి చేస్తున్న శ్రీహాన్.
అవును యాక్టర్, యూట్యూబర్ శ్రీహాన్ గురించే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. టైటిల్ ఫేవరెట్‌గా శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెడుతున్నట్లు చెబుతున్నారు. నిజానికి శ్రీహాన్ ఎప్పుడో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాల్సింది. కానీ, మనోడు అంత ఇంట్రస్ట్ చూపించక ఇప్పటివరకు ఆఫర్ రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కానీ.. ఈసారి మాత్రం వెళ్లేందుకు ఫిక్స్ అయిపోయాడు అని చెబుతున్నారు.
గత సీజన్లో సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు శ్రీహాన్ ఎంత సపోర్ట్ చేశాడో అంతా చూశారు. ఆమెకు- షణ్ముఖ్ జశ్వంత్ మధ్య చాలా జరిగాయి. ఇద్దరూ ఇద్దరితో కమిట్ అయినా కూడా హౌస్ లోపల వారి మధ్య రిలేషన్ డెవలప్ అయ్యింది. ఆ కారణంగానే షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునైనా వారి లవ్ బ్రేకప్ చేసుకున్న సంగతీ తెలిసిందే. కానీ, శ్రీహాన్ మాత్రం సిరికి సపోర్ట్ గానే నిలిచాడు.
ఆమెపై ఎన్నో పుకార్లు, నెగెటివ్ కామెంట్స్ వచ్చిన నేపథ్యంలోనూ శ్రీహాన్ ఆమెకు సపోర్టివ్ గానే ఉన్నాడు. తల్లి ఆమెపై కోప్పడినా కూడా.. శ్రీహాన్ మాత్రం అలా చేయలేదు. ఎక్కడా ఆమె క్యారెక్టర్ ని బ్యాడ్ చేసేలా మాట్లాడలేదు. ఎక్కడా ఆమె ఆత్మగౌరవం దెబ్బతినేలా ఒక్క మాటనలేదు. తాను ప్రేమించిన అమ్మాయి గురించి ఎలాంటిదో అందరికీ తెలిసేలా సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు పెట్టాడు. ఆమె అంతదూరం రాగలిగింది అంటే అందుకు శ్రీహాన్ సపోర్ట్ కూడా ఒక కారణంగా చెప్పచ్చు.
అయితే ఇప్పుడు శ్రీహాన్ హౌస్‌లోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో.. సిరి హన్మంత్ ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తుంది అనే దానిపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ఫాలోయింగ్ పరంగా చూసుకుంటే శ్రీహాన్ కంటే సిరినే ఫేమ్ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే శ్రీహాన్ కోసం సిరి భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీహాన్‌ని టైటిల్‌తో బయటకు తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్రయత్నించనున్నట్లు చెబుతున్నారు. శ్రీహాన్ ఫ్యాన్స్, సిరి ఫ్యాన్స్ ఇద్దరూ కలిసి ఓట్లు వేస్తే టైటిల్ నెగ్గడం పెద్ద విషయం కూడా కాదంటూ చెబుతున్నారు. శ్రీహాన్ హౌస్‌లోకి వెళ్తే.. టైటిల్ కొట్టగలడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.