బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ ఈసారి రియల్ కపుల్‌ని పంపిన విషయం తెలిసిందే. గతంలో ఓసారి రియల్ కపుల్‌ని పంపడం వల్ల వాళ్ల మధ్య గిల్లిగజ్జాలు, కంటెంట్ విషయంలోనూ బానే వర్కౌట్ అయ్యింది. అందుకే ఈ సీజన్లోనూ ఒక రియల్ కపుల్‌ని ప్రవేశ పెట్టారు. వాళ్లు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన రోహిత్ సాహ్నీ- మెరీనా అబ్రహాం. మొదటి నుంచి వీళ్లు ఇద్దరు ఒకటే కంటెస్టెంట్ అని చెప్పిన విషయం తెలిసిందే. వాళ్లు కలిసే నామినేట్ చేస్తారు. కలిసే ఆడతారు. ఎలిమినేట్ అయితే ఇద్దరూ వెళ్లిపోతారు. వీళ్లు ఇప్పటివరకు ఎంతో చలాకీగా గడపడం, హగ్ కోసం మెరీనా గొడవ పెట్టుకోవడం చూశాం. కానీ, బిగ్ బాస్ టాస్క్ ద్వారా వారి జీవితంలో ఎంత విషాదం దాగుందో చెప్పుకొచ్చారు.
రోహిత్-మెరీనా లైఫ్‌లో ఎంతో విషాదం దాగుంది. అందరికీ మెరీనా ఎంతో సన్నగా, నాజూకుగా ఉండటం తెలుసు. కానీ, కొన్నాళ్ల క్రితం మెరీనా బాగా లావైపోయింది. అందుకు సంబంధించి హౌస్‌లో చిన్న ఇష్యూ కూడా అయ్యింది. అయితే అందుకు గల కారణాలను రోహిత్-మెరీనా పంచుకున్నారు. “మాకు 2017లో పెళ్లి అయ్యింది. ఆ తర్వాత అందరూ పిల్లల గురించి ఫోర్స్ చేయడం ప్రారంభించారు. మేము నాలుగేళ్ల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. మెరీనా కన్సీవ్ కూడా అయ్యింది. ఆ విషయాన్ని ఒక గుడికి తీసుకెళ్లి మా అమ్మకు చెప్పాను. ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యింది” అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
అయితే అంతా హ్యాపీగా ఉందనుకున్న సమయంలో వారి జీవితంలో అనుకోని ఘటన జరిగింది. “ఆ తర్వాత ప్రతి రెండు వారాలకు ఒకసారి చెకప్‌కి వెళ్లాం. నాలుగు వారాల తర్వాత బేబీకి హార్ట్ బీట్ రాలేదన్నారు. సరే కదా అని వెయిట్ చేశాం. అది లాక్ డౌన్ వెళ్లడానికి వీళ్లేదు. అయినా కష్టపడి హాస్పిటల్‌కి వెళ్తూ ఉన్నాం. మూడు నెలలు గడిచిపోయింది. కానీ, బేబీకి హార్ట్ బీట్ రాలేదు. ఇంక డాక్టర్స్ తప్పదు అబార్ట్ చేయాలి అని చెప్పారు. అందుకు మెడిసిన్స్ ఇచ్చారు. మేం మెరీనా వాళ్ల అమ్మ వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాం. మెరీనా టాబ్లెట్స్ వేసుకుంది. తర్వాత చూస్తే రూమ్ మొత్తం ఆమె రక్తంతో నిండిపోయింది. అంతేకాకుండా చిన్న చిన్న టిష్యూస్ లా కనిపించాయి” అంటూ రోహిత్ సాహ్నీ- మెరీనా వారి జీవితంలోని విషాద ఘటనను చెప్పుకొచ్చారు. రోహిత్- మెరీనా జీవితంలో జరిగిన విషాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.