తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ షురూ అయిపోయింది. అట్టహాసంగా బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌ను హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరిని హౌస్‌లోకి పంపిస్తూ జోష్ రెట్టింపు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. లిస్ట్ పెద్దగా ఉండటంతో ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. లిస్ట్ లో నాలుగో కంటెస్టెంట్ గా నేహా చౌదరి అడుగుపెట్టింది. అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో స్టేజ్ మీద వాతావరణాన్ని మొత్తాన్ని మార్చేసింది. నేహా చౌదరి హౌస్‌లోకి వస్తోంది అనగానే అభిమానుల్లో జోష్ రెట్టింపైంది. ఐతే పెళ్లి చేసుకో లేదంటే.. బిగ్ బాస్ కి వెళ్లాలనే షరతు మీద హౌస్ లో అడుగు పెట్టినట్లు నాగార్జున రివీల్ చేయడంతో నేహా ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది.
నేహా చౌదరి.. స్పోర్ట్స్ పర్సన్, యాంకర్, డాన్సర్, నటి, యోగా ట్రైనర్ కూడా అని అందరికీ తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్ లో ప్రెసెంటర్‌గా నేహా చౌదరికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆమె ఫిట్‌నెస్ లెవల్స్ చూస్తే మతిపోతుంది. అలాంటి భామ ఇప్పుడు బిగ్ బాస్‌లో అడుగుపెట్టగానే అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేహా చౌదరి నుంచి 100 శాతం ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నారు. ఆమె గురించి తెలియని వారు.. నేహా చౌదరి ఎక్కడ పుట్టింది? ఏం చదువుకుంది? ఆమె పుట్టినరోజు ఎప్పుడు ఇలాంటి పర్సనల్ విషయాలు అన్నీ వెతకడం ప్రారంభించారు. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.