మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ మొదలైందంటే చాలు.. బుల్లితెర ప్రేక్షకులలో కలిగే ఉత్సాహం వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే.. గత ఐదు సీజన్స్ నుండి విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న బిగ్ బాస్.. ఇప్పుడు 6వ సీజన్ కి రెడీ అయిపోయింది. ఇక ఈసారి ‘బిగ్ బాస్ తెలుగు 6’ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. ప్రతిసారిలాగే ఈ 6వ సీజన్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ సీజన్ లో మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. వారిలో దంపతులు కూడా ఉండటం విశేషం. ఈ బిగ్ బాస్ సీజన్ తెలుగు ఆఖరి సభ్యుడిగా సింగర్ రేవంత్ హౌస్ లో అడుగుపెట్టాడు.
రేవంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శ్రీకాకుళంలో పుట్టిపెరిగిన రేవంత్.. చిన్నప్పటి నుండి సింగింగ్ పై ప్యాషన్ తో ఎన్నో సింగింగ్ షోలలో పాల్గొన్నాడు. ఇక బాహుబలి మూవీలో మనోహరి సాంగ్, అర్జున్ రెడ్డి సాంగ్స్ తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే.. రేవంత్ క్రేజ్ కేవలం తెలుగు వరకే ఆగిపోలేదు. ‘ఇండియన్ ఐడల్ సీజన్ 9’ విజేతగా ఇండియా వైడ్ గుర్తింపు పొందాడు. ఇక సింగర్ గా తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా రాణిస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. ఎన్నో సింగింగ్ కంపెటేషన్స్ లో విజేతగా నిలిచిన రేవంత్.. ఈసారి బిగ్ బాస్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టకముందే టైటిల్ తో బయటికి వస్తానని చెప్పి సవాల్ చేసిన రేవంత్.. ఇంట్లోకి గ్రాండ్ గా సాంగ్స్ మాషప్ తో హుషారుగా ఎంట్రీ ఇచ్చాడు. అదీగాక రేవంత్ ఇటీవల తాను ఇష్టపడిన అమ్మాయి అన్వితను పెళ్లి చేసుకొని హ్యాపీగా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. మరి సింగర్ రేవంత్ గురించి మీ అభిప్రాయాలను, బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా లేదా? కామెంట్స్ లో తెలియజేయండి.