వాళ్లిద్దరూ ‘కార్తీకదీపం’ అనే సూపర్ హిట్ సీరియల్ లో లీడ్ యాక్టర్స్. డాక్టర్ బాబు-వంటలక్క చనిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కథని మొదలుపెట్టారు. హిమగా కీర్తిభట్, శౌర్యగా అమూల్య గౌడలు వచ్చారు. ఓ మూడు నాలుగు నెలలపాటు ఈ స్టోరీ నడిపించారు. కానీ ఓల్డ్ వెర్షన్ కార్తీకదీపం క్రేజ్ వేరే లెవల్. ఇది మాత్రం అంతలా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ వంటలక్క-డాక్టర్ బాబులని తీసుకొచ్చారు. స్టోరీని ప్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లిపోయారు. నెక్స్ట్ జనరేషన్ కథని పక్కనపెట్టేశారు. హిమ-శౌర్య పెద్దయిన క్యారెక్టర్స్ చేసిన వాళ్లని ఖాళీగా ఉంచడం ఎందుకని బిగ్ బాస్ హౌసులోకి పంపేశారు. మరి వాళ్లు ఎలా ఆడుతున్నారు? ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. సెలబ్రిటీలు రావాలి. కానీ తెలుగులో అది ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ వరకు మాత్రమే జరిగింది. ఆ తర్వాత నుంచి సెలబ్రిటీలు అని కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు, సింగర్స్, యూట్యూబర్స్ ఇలా ఎవరిని పడితే వాళ్లని తీసుకొచ్చేశారు. ఇవికాస్త షో రేటింగ్స్ పైనా ప్రభావం చూపించాయి. ప్రస్తుత సీజనే తీసుకుంటే.. సింగర్ రేవంత్ తప్పించి మిగతా వారిలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రేక్షకులకు పెద్దగా తెలియదు! దీనికి తోడు టాస్కులు, గేములు కూడా ఏమంత ఆసక్తికరంగా ఉండట్లేదు.
ఇకపోతే ‘కార్తీకదీపం’ సీరియల్ తెలుగులో ఎంత క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సీరియల్ లో డాక్టర్ బాబు-వంటలక్క కారు ప్రమాదంలో చనిపోయేలా చేశారు. నెక్స్ట్ జనరేషన్ కథని ప్రారంభించారు. నాలుగైదు నెలలు ప్రసారం చేశారు కానీ లాభం లేకుండా పోయింది. దీంతో మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లిపోయారు. ఇక పెద్ద హిమ-శౌర్యగా యాక్ట్ చేసిన కీర్తి భట్-అమూల్య గౌడని బిగ్ బాస్ హౌసులోకి పంపించేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వారి గురించి డిస్కషన్ నడుస్తోంది.
ఇక తెలుగు సీజన్ లో కీర్తి ఎప్పుడూ ఏడుస్తూ, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షపెడుతుండగా.. మరోవైపు కన్నడ బిగ్ బాస్ హౌసులో ఉన్న అమూల్య గౌడ మాత్రం దుమ్మురేపుతోంది. అమూల్య అయితే.. అక్కడ టాప్-5లోనూ ఉంటుందనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఇక్కడైతే కీర్తి.. ఎలిమినేట్ అయ్యేది ఈ వారామా? తర్వాతి వారామా అనేలా ఆడుతోంది. సీరియల్ నటిగా మంచిపేరు తెచ్చుకున్న కీర్తికి.. బిగ్ బాస్ హౌసులోకి రావడం పీడకలే! మరి కీర్తి ఎన్ని వారాలు ఉంటుందో ఏంటో? బిగ్ బాస్ హౌసులోకి ‘కార్తీకదీపం’ వెళ్లడం, వాటి ఆటపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.