బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. టికెట్ టూ ఫినాలే టాస్కుతో మరింత ఉత్కంఠగా మారుతోంది. ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్‌కి ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులు అంతా ఆ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. సింగర్ రేవంత్ తండ్రైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1న అతనికి పండంటి అమ్మాయి పుట్టింది. అయితే ఇంకా ఆ విషయం రేవంత్‌కి తెలియదు. అతనికి ఎలా చెప్తారు? అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనే ఉత్కంఠ అందరిలో ఉంది. అయితే రేవంత్‌ని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి విడిగా చెప్పారు అని లీకులు వినిపిస్తున్నాయి. రేవంత్ కూడా ఆ మాట వినగానే బాగా ఎమోషనల్ అయ్యాడు అంట. అంతేకాకుండా రేవంత్ ఎలా అయితే అమ్మాయి పుట్టాలని కోరుకున్నాడో.. అలాగే అమ్మాయి పుట్టడంతో ఆనందానికి అవధులు లేవని చెబుతున్నారు.
ఇంక ఈ వారం టికెట్ టూ ఫినాలో టాస్కులో తొలి ఫైనలిస్ట్ గా శ్రీహాన్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. మొదటి కొన్ని టాస్కులు పెట్టినప్పుడు అంతా ఆదిరెడ్డి విన్నర్ అనుకున్నారు. కానీ, అన్నీ టాస్కులు పూర్తైన తర్వాత విన్నర్‌గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ఈ వారం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే.. ఎలిమినేషన్. అవును ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారు? ఆ విషయానికి వస్తే.. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం ఫైమా ఎలిమినేట్ కాబోతందని తెలుస్తోంది. గత వారమే ఆమె ఎలిమినేట్ కావాల్సింది. కానీ, ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా.. ఫైమా సేవ్ అయితే రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. అంటే ప్రేక్షకులు ఆమెని ఇప్పటికే ఎలిమినేట్ చేశారు. కానీ, బిగ్ బాస్ వల్ల ఒకవారం ఎక్కువగా ఇంట్లో ఉంది.
అయితే అలా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో సేవ్ అయినా కూడా.. ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఫైమా వచ్చిన కొత్తలోకి ఇప్పటికి చాలా మారిపోయింది. ఇప్పుడు ఫైమా కామెడీ కంటే ఆమె వెటకారం అంటే ఎక్కువగా చిరాకు పడుతున్నారు. ఫ్రెండ్స్ గా ఉన్న ఇనయా- ఫైమా శత్రువుల్లా మారడం, ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడం అనే ఎపిసోడ్ ఫైమాకి బాగా మైనస్ అయ్యింది. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఫైమా విరోధం పెంచుకుంది. ఎవరు ఏమన్నా వెటకారం చేయడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ కలిసి ఆమెకు నెగెటివ్ అయినట్లు భావిస్తున్నారు. ఈ వారం అనధికారికంగా జరిపిన చాలా పోల్స్ లో కూడా ఫైమాకు లీస్ట్ ఓట్లు వచ్చాయని చెబుతున్నారు.