సింగర్ రేవంత్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. డిసెంబర్ 1న రేవంత్ భార్య అన్విత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఏదైతే రేవంత్ కోరుకున్నాడో అదే విధంగా వారి ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంకా ఈ విషయం కచ్చితంగా రేవంత్‌కి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే శనివారం, ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఈ విషయాన్ని రేవంత్‌కు తెలియజేస్తాడు. అయితే అది కూడా ఎలా చెప్తారు? అసలే రేవంత్ జీవితంలో ఎంతో ఆనంద క్షణాలు అవి. వాటిని అతనికి ఎలా తెలియజేస్తారు. అతను బయట ఉండి ఉంటే తన భార్యను దగ్గరుండి చూసుకునే వాడు. కానీ, ఇప్పుడు హౌస్‌లో ఉండటం వల్ల అది జరగదు. మరి.. ఆ వార్త అయినా సర్‌ప్రైజింగ్ గా చెప్పాలి కదా.
బిగ్ బాస్ యాజమాన్యం ఎలా చెప్పేందుకు రెడీ అయ్యిందే తెలియదు గానీ.. ఇప్పుడు ఒక వార్త అయితే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. సింగర్ రేవంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నాడు అని. అవును అయితే అది ఎలిమినేట్ అయ్యే వస్తాడు అనుకోకండి. సింగర్ రేవంత్ లైఫ్‌లోనే ఇది ఎంతో అద్భుతమైన, మరపురాని క్షణం కాబట్టి.. దానిని అంతే స్పెషల్‌గా ప్రెజెంట్ చేయాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోందని టాక్ వినిపిస్తోంది. అందుకోసం అతడిని హౌస్ నుంచి బయటకు కూడా పపేందుకు సిద్ధమయ్యారంటూ చెబుతున్నారు. అయితే మీరు అనుకోవచ్చు.. సింగర్ రేవంత్ అంత స్పెషల్ ఏంటి? అలా ఎందుకు పంపుతారు? అనే ప్రశ్న మీకు కచ్చితంగా వస్తుంది.
అయితే సింగర్ రేవంత్ ఒక్కడే అంత స్పెషల్ కాదు. అతడిని అలా పంపుతారు అకోవడానికి గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఉదాహరణలుగా ఉన్నాయి. అవేంటంటే.. ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆమెపై మాదకద్రవ్యాల కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బిగ్ బాస్‌లో ఉన్న ముమైత్‌ని ఎలిమినేట్ చేసి పంపేసినట్లు పంపేసి. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చారు. అలాగే అలీ రజా కూడా హౌస్‌లో ఉన్నప్పుడు అతని తండ్రి ఆరోగ్యం బాలేదని తెలిసింది. వెంటనే ఆ వారం అలీ రజాని ఎలిమినేట్ చేసి బయటకు పంపారు. తర్వాత కొన్ని వారాల తర్వాత మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో లోపలికి పంపారు. అలా ఇంకా చాలామందే ఉన్నారు. హిందీ బిగ్ బాస్‌లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.
అందుకే అదే ఫార్ములాను ఇక్కడ ఉపయోగిస్తారని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. అదేంటంటే.. ఇంకా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగిసేందుకు దాదాపు 15 రోజులు మాత్రమే ఉన్నాయి. అంటే డిసెంబర్ 17 గానీ, 18 గానీ ఈ సీజన్ ముగుస్తుంది. కాబట్టి ఈ రెండు వారాల కోసం రేవంత్‌ని ఎలిమినేట్ చేసి మళ్లీ.. వైల్డ్ కార్డ్ ఇచ్చే అవకాశం దాదాపుగా లేకపోవచ్చని చెబుతున్నారు. కాకపోతే అతను తండ్రి అయ్యాడు అనే విషయాన్నే కాస్త స్పెషల్‌గా ప్లాన్ చేస్తారేమో అంటున్నారు. అయితే ఇలా ఎన్ని చెప్పుకున్నా శనివారం స్టేజ్ మీదకు నాగార్జున వచ్చే వరకు ఏదీ అధికారికం కాదు. కాబట్టి అసలు విషయం కోసం ఇంకా కొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.