బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. గీతూ రాయల్ ఎలిమినేషన్‌తో షోకి మళ్లీ హైప్ వచ్చింది. వీకెండ్ ఫన్ తర్వాత.. సోమవారం ఎలిమినేషన్స్ చూసి ప్రేక్షకులు కూడా బాగా హీటైపోయారు. మొత్తం 9 మంది నామినేషన్స్ లో ఉన్నారు. బాలాదిత్య, మెరీనా, కీర్తీ భట్, ఫైమా, వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయా సుల్తానా నామినేషన్స్ లో ఉన్నారు. తాము నామినేట్ చేసే సభ్యులను పోడియం లాటి దానిపై నిల్చోబెట్టి ముఖాని నీళ్లు కొట్టారు. ఆ సమయంలో హౌస్‌లో గట్టిగానే రచ్చ జరిగింది. ముఖ్యంగా హౌస్‌లో ఇనయా సుల్తానా- ఫైమాకి మధ్య రిలేషన్ అంత బాగా లేదని అందరికీ తెలిసిందే.
ఇప్పుడు మంగళవారం స్టార్ట్ అయిన కెప్టెన్సీ టాస్కుతో అది ఇంకాస్త ముదిరిపోయింది. కెప్టెన్సీ పోటీదారల టాస్కుకోసం పాము- నిచ్చెన అని గేమ్ ఇచ్చారు. అందులో కొందరికి పాములను తయారు చేయమని.. ఇంకొందరికి నిచ్చెనలను తయారు చేయమని టాస్కులు ఇచ్చారు. అందులో ఇనయా నిచ్చెన తయారు చేస్తోంది. అప్పుడు ఫైమా సహా చాలా మంది వచ్చి ఇనయా సుల్తానా నిచ్చెనని పాడు చేసేందుకు ప్రయత్నించారు. ముఖ్యాంగా ఫైమా- ఇనయాని టార్గెట్ చేసినట్లు కనిపించింది. ఫైమా- ఇనయా ఇద్దరూ కుస్తీ పట్లు పట్టారు. ఇనయా ఫైమాని ఎత్తి పక్కన పడేసింది. ఇంట్లోని సభ్యులు వద్దు ఇనయా అంటున్నా కూడా వినకుండా ఫిజికల్ అయ్యింది.
అయితే బిగ్ బాస్ ఇదంతా చూస్తూ ఊరికే ఉండడు కదా. వాళ్ల మధ్య ఉన్న వైరాన్ని మరింత పెంచేలా ఓ నిర్ణయం తీసుకున్నాడు. మూడో రౌండ్ ముగిసే సమయానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. వాళ్లు తయారు చేసిన నిచ్చెనలు ఎలా ఉన్నాయో చూసి.. సరిగ్గాలేని వారి నిచ్చెనని ఎంచుకుని ఎలిమినేట్ చేయాలంటూ సూచించారు. అందరూ అనుకున్నట్లే ఫైమా అన్ని నిచ్చెనలు పరిశీలించి.. చివరకు ఇనయా నిచ్చెన చిన్నగా ఉంది కాబట్టి ఎలిమినేట్ చేస్తున్నా అంటూ ప్రకటించింది. ఇంక ఫైమా నిర్ణయంతో చిర్రెత్తుకొచ్చిన ఇనయా సుల్తానా హౌస్‌లో ఉన్న వరస్ట్ ప్లేయర్ నువ్వే అంటూ కేకలు వేస్తూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇంక గేమ్ మధ్యలో ఇనయా- వాసంతికి, ఇనయా- శ్రీ సత్యకి బాగా యుద్ధాలు జరిగాయి. వీళ్ల తీరు చూసి ఆదిరెడ్డి.. వీళ్లు మరీ అతిగా ఆడుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశాడు.