బిగ్ బాస్ హౌజ్ లో మొదటి టాస్క్ మొదలవ్వడంతోనే గొడవలు మొదలయ్యాయి. వరుసగా టాస్కుల్లో ఓడిపోతుండడంతో ఇనయ సుల్తానా కంట్రోల్ తప్పుతోంది. వరుసగా టాస్క్ లో ఓడిపోతున్నానన్న ఫ్రస్ట్రేషన్ లో ఆ కోపాన్ని ఆదిరెడ్డిపై చూపిస్తోంది. ‘క్లాస్-మాస్-ట్రాష్’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ని క్లాస్, మాస్, ట్రాష్ అని మూడు కేటగిరీలుగా విభజించారు. క్లాస్ కేటగిరీలో పడ్డ ఇంటి సభ్యులు హౌజ్ లోనే ఉంటూ సౌకర్యాలు అనుభవించే ఛాన్స్ ఉంటుంది. ట్రాష్ కేటగిరీలో పడ్డ హౌజ్ మేట్స్ గార్డెన్ ఏరియాలో ఉండాలి. ఇచ్చిన వసతుల్లో అక్కడే వండుకుని, అక్కడే తినాల్సి ఉంటుంది. ఇక మాస్ కేటగిరీ గురించి సస్పెన్స్ లో ఉంచాడు బిగ్ బాస్.
ఇక ట్రాష్ కేటగిరీలో ఉన్న హౌజ్ మేట్స్ ని మాస్ లోకి, మాస్ కేటగిరీలో ఉన్న హౌజ్ మేట్స్ ని క్లాస్ లోకి వెళ్లేలా బిగ్ బాస్ రోల్ బేబీ రోల్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ మొదటి రౌండ్ లో ఇనయ సుల్తానా ఓడిపోయింది. అయితే తనకు బాలాదిత్య అడ్డు వచ్చాడని గొడవ చేసింది. దీంతో కాసేపు హౌజ్ లో వేడి వాతావరణం నెలకొంది. అప్పుడు ఆదిరెడ్డి కొద్దిగా మెల్లగా మాట్లాడండి అంటూ ఇనయ సుల్తానాకి చెప్పాడు. దీంతో సుల్తానా, ఆదిరెడ్డితో వాదానికి దిగింది. ఆ తర్వాత రెండో రౌండ్ లోనూ ఇనయ ఓడిపోయింది. దీంతో ఇనయకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. హౌజ్ లో ఎవరూ తనకు సపోర్ట్ చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. లివింగ్ రూమ్ లో హౌజ్ మేట్స్ కి వివరణ ఇస్తున్నప్పుడు ఆదిరెడ్డితో గొడవకు దిగింది.
“మీదకొచ్చి మాట్లాడుతున్నావ్ ఏంటి, కళ్ళు పెద్దవి చేసి చెప్తున్నావేంటి” అంటూ ఆదిరెడ్డితో వాగ్వాదానికి దిగింది. అయితే ఆదిరెడ్డి ఇనయకి వివరణ ఇచ్చాడు. దీంతో కాసేపటికి ఇనయ కూల్ అయ్యి.. తన తన మాటలని వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడించింది. హౌజ్ లో ఎవరూ సపోర్ట్ చేయడం లేదనడం తన తప్పే అని చెప్పింది. ఇక ఇనయ సుల్తానా రెండు గేమ్స్ లోనూ ఓడిపోయింది. దీంతో ఆమె ట్రాష్ టీమ్ లోనే ఉంది అయితే ట్రాష్ టీమ్ లో ఉన్న వాళ్ళు నేరుగా నామినేషన్స్ లోకి వస్తారని బిగ్ బాస్ చెప్పాడు. మరోవైపు హౌజ్ లో ఇనయ సుల్తానా ప్రవర్తన బాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇనయ సుల్తానా ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి. మరి ఆదిరెడ్డి పట్ల ఇనయ సుల్తానా ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.