తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో 6వ సీజన్ మెల్లమెల్లగా ఊపందుకుంటోంది. ఎనిమిదో వారం కెప్టెన్సీ పోరులో ట్విస్టులు బాగానే ఆకట్టుకుంటున్నాయి. మొదటి నుండి హౌస్ లో కొందరి పేర్లు లవ్ బర్డ్స్ గా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఆర్జే సూర్య, ఇనయ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే.. మొదట్లోనే ఇద్దరూ జంట పక్షుల్లా తిరిగి విమర్శలు ఎదుర్కొని, మధ్యలో కొన్ని వారాలు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఇవన్నీ ప్రతి సీజన్ లో జరిగేవే. హౌస్ లోనే కనెక్ట్ అయిన ఇద్దరి మధ్య అలకలు, కోపాలు, జలసీ ఫీల్ అవ్వడం.. ఆఖరికి మళ్లీ ఏదొక టైంలో కలిసిపోవడం.
ప్రస్తుతం ఆర్జే సూర్య, ఇనయ చేసిన పనికి ఇలాంటివి ఎన్ని చూడలేదు అని అనుకుంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. తాజాగా బిగ్ బాస్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో కొందరు కెప్టెన్సీ పొజిషన్ కోసం పోటీ పడుతుండగా.. మరికొందరు హౌస్ లో ఎవరిని వారు సేవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రోమో చూసినట్లయితే.. ఓవైపు కెప్టెన్సీ పోరు జరుగుతుండగా.. మరోవైపు సూర్య, ఇనయల కౌగిలి సీన్ హైలైట్ గా మారింది. సంచాలక్ గా గీతూ.. ఆమె గురించి కారాలు మిరియాలు నూరుతూ కీర్తి, రేవంత్.. మరోవైపు బాలాదిత్యపై చిర్రుబుర్రులాడుతూ శ్రీ సత్య ఇవన్నీ ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి.
ఇక కెప్టెన్సీ రేసులో సూర్య, రేవంత్, శ్రీహాన్, ఫైమా, శ్రీసత్య, కీర్తిలు పోటీపడ్డట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రోమో మొత్తంలో హైలైట్ ఏంటంటే.. ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య ఒకరినొకరు గాఢంగా హగ్ చేసుకుని ఏడ్వడం. ఏడుస్తున్న ఇనయను గట్టిగా హగ్ చేసుకొని మరీ ఏడవొద్దంటూ సూర్య ఓదార్చడం విశేషం. మొన్నటివరకూ జంట పక్షుల్లా కలిసున్న వీరిద్దరూ.. లాస్ట్ వీక్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అదీగాక సూర్యపై ఇనయ చాలా కామెంట్స్ చేసింది. కానీ.. ఇంతలోనే ఏమైందోగానీ.. ఇద్దరు స్పాట్ స్టోర్ రూమ్ లోకి వెళ్లి హగ్ చేసుకొని కనిపించారు. మళ్లీ ఏమైంది వీళ్లిద్దరికీ అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.