బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. మూడోవారంలో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో హౌస్ మేట్స్ ఉగ్రరూపం దాల్చారు. ఎవరిని కదలించినా కొట్టేసేంత పని చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో పోలీసులు, దొంగలుగా విడిపోయి నానా రచ్చ చేశారు. చివరకి ఆ టాస్కులో పోలీసులు విజయం సాధించారు. గీతూ రాయల్ కూడా స్వార్థపరురాలైన వ్యాపారస్థురాలిగా విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది. మొత్తానికి ఈ అడవిలో ఆట అనే టాస్కు పుణ్యమా అని హౌస్ మొత్తం తెగ కొట్టేసుకున్నారు. కొందరికి దెబ్బలు కూడా తగిలాయి. ఎప్పుడూ ఆడని కంటెండర్లు సైతం నాగార్జున పీకిన క్లాస్‌తో లేచి గేమ్‌లో అడుగుపెట్టారు. శ్రీ సత్య లాంటివాళ్లైతే ఉత్తమ ప్రదర్శన చేసి కెప్టెన్సీ కంటెండర్ కూడా అయ్యారు.
ఇంక టాస్కు విషయానికి వస్తే ఈ అడవిలో ఆటలో చాలా గొడవలు జరిగాయి. అందులో బాగా కాంట్రవర్సీ అయ్యింది, పెద్ద ఆరోపణలు జరిగింది ఇనయా సుల్తానా గొడవలో మాత్రమే. ఈ టాస్కులో మొదట శ్రీహాన్- రేవంత్‌తో గొడవ పడిన ఇనయా సుల్తానా ఆ తర్వాత లేడీ కంటెండర్లతో వాదనకు దిగింది. అసలు ఏం జరిగిందంటే.. టాస్కులో భాగంగా పోలీసులు రైడ్‌కి వెళ్లాలి. అయితే దొంగలు నియమాలకు తగినట్లు ఆడటం లేదంటూ పోలీసులు కూడా అలాగే ఆడండి అని ఆదిరెడ్డి చెప్పాడు. వెంటనే వెళ్లి ఇనయా సుల్తానా చెప్పిన ప్లేస్ కాకుండా లగేజ్ రూమ్‌లో రైడ్‌కి వెళ్లింది. దొంగల టీమ్ మొత్తం వెళ్లి ఆమెను నిలువరించారు. ఆ రూమ్‌లో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ లోపే విజిల్ రావడంతో ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.
ఇనయా సుల్తానాను నిలువరించే క్రమంలో ఆమె దొంగల టీమ్‌పై ప్రతిఘటించింది. ఆమె పెనుగులాడటంతో నేహా, ఆరోహీ రావులకు దెబ్బలు తగిలాయని చెప్పుకొచ్చారు. తనని చెంపదెబ్బ కొట్టిందని, ఛాతి మీద పట్టుకుని నెట్టేసిందని నేహా చౌదరి ఆరోపించింది. ఇంక ఆరోహీ విషయానికి వస్తే ఆమెను తన్నిందని హౌస్ మేట్స్ చెబుతున్నారు. ఇంక ఇనయా వాదనకు వస్తే.. హౌస్ మేట్స్ ఆమెను గుంపుగా పట్టుకున్నారని.. తన డ్రెస్ లాగారంటూ ఇనయా సుల్తానా పెద్ద ఆరోపణ చేసింది. అయితే ఆమె డ్రెస్సు లాగారు అనే మాటను గీతూ రాయల్ ఖండించింది. అందరూ పట్టుకున్నరు ఓకే గానీ, డ్రెస్ ఎత్తేశారనేది నిజం కాదంటూ వాదించింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ మొత్తం ఈ గొడవతో ఫుల్ హీటెక్కిపోయింది. ఇనయా సుల్తానా- దొంగల టీమ్ గొడవలో తప్పు ఎవరెది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.